తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Ktm 390 Adventure: కేటీఎం నుంచి సరికొత్త బైక్.. కేటీఎం 390 అడ్వెంచర్

2024 KTM 390 Adventure: కేటీఎం నుంచి సరికొత్త బైక్.. కేటీఎం 390 అడ్వెంచర్

HT Telugu Desk HT Telugu

04 November 2023, 18:41 IST

google News
  • 2024 KTM 390 Adventure: యూత్ కు ఇష్టమైన బైక్స్ లో కేటీఎం మోడల్స్ ముఖ్యమైనవి. తాజాగా, తమ లైనప్ లోకి 2024 మోడల్ 390 అడ్వెంచర్ ను కేటీఎం తీసుకువచ్చింది.

కేటీఎం 390 అడ్వెంచర్‌
కేటీఎం 390 అడ్వెంచర్‌

కేటీఎం 390 అడ్వెంచర్‌

2024 KTM 390 Adventure: భారత మార్కెట్లో నవీకరించబడిన డ్యూక్స్‌ను ప్రారంభించిన తర్వాత, KTM గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పుడు లేటెస్ట్ గా కేటీఎం 390 అడ్వెంచర్‌ 2024ను ఆవిష్కరించింది. అయితే, కలర్ స్కీమ్ లో మార్పులు, స్వల్పంగా కాస్మెటిక్ మార్పులను మినహాయిస్తే ఈ లేటెస్ట్ కేటీఎం 390 అడ్వెంచర్ లో పెద్దగా మార్పులేమీ చేయలేదు.

ఇంజన్, డిజైన్.. ఇతర వివరాలు

2024 390 అడ్వెంచర్‌ లో 373.2 సిసి, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూలింగ్‌ ఇంజన్ ఉంటుంది. ఇది 9,000 rpm వద్ద 43 bhp గరిష్ట శక్తిని మరియు 7,500 rpm వద్ద 37 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ తో వస్తుంది. ఇది క్విక్‌షిఫ్టర్, స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో వస్తుంది. ఈ లేటెస్ట్ కేటీఎం 390 అడ్వెంచర్ లో రెండు కొత్త రంగులు ఉన్నాయి. అవి అడ్వెంచర్ వైట్, అడ్వెంచర్ ఆరెంజ్. ఈ రెండు కలర్‌ లకు స్కీమ్ లకు ఫ్రేమ్ కలర్ ను తెలుపు, లేదా గ్రే కలర్ ను రైడర్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ సదుపాయం అల్లాయ్ మోడల్‌ 390 అడ్వెంచర్‌ లకు మాత్రమే ఉంది. త్వరలో హెవీ-డ్యూటీ, స్పోక్డ్ వీల్స్, రెడీ టు రేస్ ర్యాలీ, మరింత ఆఫ్‌రోడ్-ఫోకస్డ్ వెర్షన్‌ లను విడుదల చేయనున్నట్లు కేటీఎం వెల్లడించింది.

సస్పెన్షన్, బ్రేకింగ్..

ముందు వైపు అప్-సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్‌ సస్పెన్షన్స్ ఉన్నాయి.. అలాగే, ముందు వైపు రేడియల్ మౌంటెడ్ కాలిపర్‌తో 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక వైపు ఫ్లోటింగ్ కాలిపర్‌తో 230 మిమీ డిస్క్ బ్రేక్ లను అమర్చారు. ఫీచర్ల పరంగా, 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ లో ట్రాక్షన్ కంట్రోల్‌తో 3D IMU (ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్), క్విక్‌షిఫ్టర్+, లీన్ యాంగిల్ సెన్సిటివ్ కార్నరింగ్ ABS, రైడింగ్ మోడ్‌లు (స్ట్రీట్ & ఆఫ్‌రోడ్), ఆఫ్‌రోడ్ ABS, రైడ్-బై-వైర్, LED హెడ్‌ల్యాంప్‌ తదితర ఫీచర్స్ ఉన్నాయి. ఇది కాకుండా, 46 mm థ్రాటిల్ బాడీ స్లిప్పర్ క్లచ్, హ్యాండిల్‌బార్‌పై స్విచ్ గేర్ తో నియంత్రిగలిగే 5-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే కూడా ఉన్నాయి.

తదుపరి వ్యాసం