2024 Kia EV6 : 2024 కియా ఈవీ6 వచ్చేస్తోంది.. సూపర్ ఫీచర్స్‌తో!
02 December 2023, 11:18 IST
- 2024 Kia EV6 : కియా ఈవీ6కి అప్డేటెడ్ వర్షెన్‌ని ప్లాన్ చేస్తోంది సంస్థ. ఇది.. ఇటీవలే జర్మనీ రోడ్లపై దర్శనమిచ్చింది.
కియా ఈవీ6
2024 Kia EV6 : కియా ఈవీ6 ఎలక్ట్రిక్ క్రాసోవర్‌కు అప్డేటెడ్ వర్షెన్‌ని తీసుకురాబోతోంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. 2024లో మధ్యలో ఇది లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రాసోవర్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్..
ప్రస్తుతం ఉన్న కియా ఈవీ6లో 77.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. సింగిల్ మోటార్ రేర్ వీల్ డ్రైవ్ లేదా డ్యూయెల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ ఇందులో ఉంటాయి. మొదటిది 226 హెచ్‌పీ పవర్‌ని, 350 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. రెండోది.. 321 హెచ్‌పీ పవర్‌ని, 605 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 710 కి.మీల దూర ప్రయాణించవచ్చు.
2024 Kia EV6 price : ఇక అప్డేట్ వర్షెన్.. జర్మనీ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించిది. ఇందులో కొత్త బంపర్స్, డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్, అప్డేటెడ్ హెడ్‌లైట్స్, రివైజ్డ్ టెయిల్‌లైట్ క్లస్టర్స్ వంటివి వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ ప్యాక్‌ని మార్చకపోవచ్చని తెలుస్తోంది.
ఈ కియా ఈవ6 ఇంటీరియర్, ఎక్స్టీరియర్కి సంబంధించి ప్రస్తుతం పెద్ద వివరాలు అందుబాటులో లేవు. లాంచ్ సమయం దగ్గరపడే కొద్ది, వీటిపై ఓ క్లారిటీ వస్తుందని అంచనాలు ఉన్నాయి. కాగా.. లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ ఇందులో ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
2024 Kia EV6 features : ఇండియాలో ప్రస్తుతం ఉన్న కియా ఈవీ6 ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 60.95లక్షలుగా ఉంది. అప్డేటెడ్ వర్షెన్.. దీని కన్న కాస్త ఎక్కువగానే ఉండొచ్చు.
కియా సెల్టోస్ ధర తగ్గింపు..!
భారతదేశంలో హ్యుందాయ్ క్రెటాకు కియా సెల్టోస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. అయితే, ఇటీవల తమ సెల్టోస్ మోడల్ నుంచి ఒక ఫీచర్‌ను పాక్షికంగా తొలగించిన తర్వాత కొన్ని వేరియంట్‌ల ధరలను కియా తగ్గించింది. ల్టోస్‌పై వివిధ వేరియంట్లను బట్టి రూ. 30000 వరకు ధరను తగ్గించారు.పెట్రోల్, డీజిల్ HTX, HTX ప్లస్ ట్రిమ్ వేరియంట్ల మ్యాన్యువల్, ఏఎంటీ వర్షన్స్ పై ఈ తగ్గింపు ఉంటుంది. అలాగే, టర్బోచార్జ్డ్ పెట్రోల్, డీజిల్ యూనిట్ల GTX ట్రిమ్ DCT, ఆటోమేటిక్ వెర్షన్‌లకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. కాగా, ఎక్స్ లైన్ (X-Line) వేరియంట్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు, HTX వేరియంట్‌ల ప్రారంభ ధర రూ. 15.18 లక్షలు (ఎక్స్-షోరూమ్), GTX ప్లస్ వేరియంట్‌ల కొత్త ప్రారంభ ధర రూ. 19.38 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.