Kia Seltos price cut: కియా సెల్టోస్ ధర తగ్గింపు; ఈ ఫీచర్ ను తొలగించినందువల్లనే..
Kia Seltos price cut: దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా తమ సక్సెస్ ఫుల్ మోడల్ సెల్టోస్ (Kia Seltos) పై రూ. 30,000 వరకు ధరను తగ్గించింది. గత నెలలో కియా సెల్టోస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
Kia Seltos price cut: భారతదేశంలో హ్యుందాయ్ క్రెటాకు కియా సెల్టోస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. అయితే, ఇటీవల తమ సెల్టోస్ మోడల్ నుంచి ఒక ఫీచర్‌ను పాక్షికంగా తొలగించిన తర్వాత కొన్ని వేరియంట్‌ల ధరలను కియా తగ్గించింది.
ఈ వేరియంట్లపై..
సెల్టోస్‌పై వివిధ వేరియంట్లను బట్టి రూ. 30000 వరకు ధరను తగ్గించారు.పెట్రోల్, డీజిల్ HTX, HTX ప్లస్ ట్రిమ్ వేరియంట్ల మ్యాన్యువల్, ఏఎంటీ వర్షన్స్ పై ఈ తగ్గింపు ఉంటుంది. అలాగే, టర్బోచార్జ్డ్ పెట్రోల్, డీజిల్ యూనిట్ల GTX ట్రిమ్ DCT, ఆటోమేటిక్ వెర్షన్‌లకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. కాగా, ఎక్స్ లైన్ (X-Line) వేరియంట్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు, HTX వేరియంట్‌ల ప్రారంభ ధర రూ. 15.18 లక్షలు (ఎక్స్-షోరూమ్), GTX ప్లస్ వేరియంట్‌ల కొత్త ప్రారంభ ధర రూ. 19.38 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.
తొలగించిన ఫీచర్..
వన్-టచ్ రోలింగ్ డౌన్ సదుపాయం గతంలో అన్ని విండోలకు ఉండేది. ఇప్పుడు మిగతా విండోలకు తొలగించి, కేవలం డ్రైవర్ వైపు ఉన్న డోర్ విండోకు మాత్రమే ఆ ఫెసిలిటీని కల్పించారు. X-లైన్ ట్రిమ్ వేరియంట్లలో అన్ని విండోస్‌లో వన్-టచ్ డౌన్ ఫీచర్ కొనసాగుతుంది.
ఇంజన్ ఆప్షన్స్
కియా సెల్టోస్ 2023 వెర్షన్‌లో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్‌తో సహా మూడు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 158 bhp శక్తిని, 253 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మిగతా రెండు 1.5-లీటర్ ఇంజన్లు ఒక్కొక్కటి 115 bhp గరిష్ట శక్తిని ప్రొడ్యూస్ చేస్తాయి.