Hyundai Alcazar vs MG Hector Plus : ఈ రెండు బడా ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ?
15 September 2024, 11:33 IST
- Alcazar vs Hector Plus : 2024 హ్యుందాయ్ అల్కాజార్ వర్సెస్ ఎంజీ హెక్టార్ ప్లస్.. ఈ రెండు బడా ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? ఇక్కడ తెలుసుకోండి..
2024 హ్యుందాయ్ అల్కాజార్ వర్సెస్ ఎంజీ హెక్టార్ ప్లస్..
సరికొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఫీచర్స్‌తో 2024 హ్యుందాయ్ అల్కాజార్‌ని ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. కొత్త అల్కాజార్ హ్యుందాయ్ క్రెటాకు బిగ్గర్ వర్షెన్‌గా వస్తుంది. అయితే స్టైలింగ్ లాంగ్యువేజ్లో మాత్రం క్రేటా నుంచి అల్కాజార్ స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తుంది. హ్యుందాయ్ అల్కాజార్ అప్డేటెడ్ వెర్షన్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ .14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ధర రూ .21.55 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎంపీవీ వైబ్‌ని ఇస్తున్న ఈ ప్రీమియం ఎస్యూవీ.. మార్కెట్లో ఉన్న ఎంజీ హెక్టార్ ప్లస్‌కి గట్టిపోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
2024 హ్యుందాయ్ అల్కాజార్ వర్సెస్ ఎంజీ హెక్టార్ ప్లస్: ధర
2024 హ్యుందాయ్ అల్కాజార్ ధర రూ .14.99 లక్షల నుంచి రూ .21.55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మరోవైపు, ఎంజీ హెక్టార్ ప్లస్ ధర రూ .17 లక్షల నుంచి రూ .22.83 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
ఇదీ చూడండి:- Volkswagen SUV : టాటా నెక్సాన్‌కి పోటీగా.. వోక్స్వ్యాగన్ కొత్త ఎస్యూవీ!
2024 హ్యుందాయ్ అల్కాజార్ వర్సెస్ ఎంజీ హెక్టార్ ప్లస్: స్పెసిఫికేషన్
2024 హ్యుందాయ్ అల్కాజార్ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 158బీహెచ్పీ పవర్, 253ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మేన్యువల్ లేదా 7-స్పీడ్ డీసీటీతో కనెక్ట్ చేసి ఉంటుంది. ఇందులోని 1.5-లీటర్ యూ2 సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ 114బీహెచ్పీ పవర్, 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
ఎంజీ హెక్టార్ ప్లస్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ మోటార్లో 1.5-లీటర్ టర్బోఛార్జ్డ్ యూనిట్ ఉంటుంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్, సీవీటీతో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 141బీహెచ్పీ పవర్, 250ఎన్ఎమ్ పీక్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. మరోవైపు, డీజిల్ వేరియంట్ 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ నుంచి పవర్‌ని పొందుతుంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 167బీహెచ్పీ పవర్, 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.