2023 MG Hector : ఇండియాలో సరికొత్తగా ‘ఎంజీ హెక్టర్’.. లాంచ్ ఎప్పుడంటే!
13 November 2022, 13:16 IST
- 2023 MG Hector launch in India : ఇండియాలో సరికొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది ఎంజీ హెక్టర్. ఇందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బయటకొచ్చింది.
ఇండియాలో సరికొత్తగా ‘ఎంజీ హెక్టర్’.. లాంచ్ ఎప్పుడంటే!
2023 MG Hector launch in India : ఇండియాలో నెక్స్ట్ జనరేషన్ ఎంజీ హెక్టర్ కోసం అభిమానలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. సరికొత్త వెహికిల్‌కి సంబంధించిన కీలక ప్రకటన.. వాస్తవానికి ఈ నవంబర్లోనే రావాల్సి ఉంది. కాగా.. ఇందుకు సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది. సరికొత్త ఎంజ్ హెక్టర్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం.. 2023 జనవరి 5న లాంచ్ ఈవెంట్‌ను కూడా ఈ ఆటో సంస్థ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
నెక్స్ట్ జనరేషన్ ఎంజీ హెక్టర్ గురించి ఇప్పటికే అనేకమార్లు టీజ్ చేసింది ఈ ఆటో సంస్థ. ఫలితంగా మార్కెట్లో ఈ కొత్త ఎస్‌యూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
New MG Hector launch date in India : 2023 ఎంజ్ హెక్టర్‌లో.. సరికొత్త ఫ్రంట్ బంపర్, రీమోడల్డ్ ఎయిర్ డామ్‌తో కూడిన డైమెండ్ మెష్ గ్రిల్ ఉంటుంది. ఈ డైమెండ్ మెష్ గ్రిల్‌తో ఎస్యూవీ లుక్ మరింత బోల్డ్‌గా, కమాండింగ్, పవర్‌ఫుల్‌గా ఉంటుందని సంస్థ చెబుతోంది. డైమెండ్ మెష్ గ్రిల్ చివర్లో హెక్టర్ మార్క్ డీఆర్ఎల్లు ఉంటాయి. ఎస్‌యూవీని ఇవి మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి.
ఇక నెక్స్ట్ జనరేషన్ ఎంజీ హెక్టర్ లోపల 14 ఇంచ్ హెచ్డీ పోట్రెయిట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ ఉంటుంది. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోని ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా.. నెక్స్ట్- జెన్- ఐ-స్మార్ట్ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఫలితంగా జర్నీ చాలా సౌకర్యంగా ఉంటుందని సంస్థ స్పష్టం చేసింద. ఫుల్ డిజిటల్ 7 ఇంచ్ కన్ఫిగరేబుల్ క్లస్టర్ సెటప్ ఇందులో ఉండనుంది.
New MG Hector price : సరికొత్త ఎస్యూవీ ఇంటీరియర్‌ను "సింఫొని ఆఫ్ లగ్జరీ"గా అభివర్ణించింది ఎంజీ హెక్టర్. ఎస్యూవీ ఇంటీరియర్‌లో సినిమానిట్ ఎక్స్పీరియన్స్ లభిస్తుందని అంటోంది.
అయితే.. ఇంజిన్ విషయానికొస్తే.. కొత్త మోడల్‌కు, ప్రస్తుతం ఉన్న ఎస్యూవీ మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎంజీ హెక్టర్‌లో 1.5లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5లీటర్ పెట్రోల్ హైబ్రీడ్ మోటర్, 2.0లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
ఇక లాంచ్ తర్వాత.. ఈ సరికొత్త ఎంజీ హెక్టర్ ఎస్యూవీ.. టాటా హారియర్, జీప్ కంపాస్‌కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
ఈ వాహనానికి సంబంధించిన ధర, ఫీచర్స్‌తో పాటు పూర్తి వివరాలను 2023 జనవరి 5న సంస్థ ప్రకటించే అవకాశం ఉంది.