2023 MG Hector facelift : ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఫస్ట్ లుక్.. అదిరిందిగా!
08 January 2023, 14:04 IST
- 2023 MG Hector facelift : ఎంజీ హెక్టార్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వస్తోంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకొచ్చింది. ఆ వివరాలు..
ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్
2023 MG Hector facelift : ఇండియా ఆటో మార్కెట్లో ఎంజీ మోటార్ దూసుకెళుతోంది. నెలనెలా మంచి సేల్స్‌ను నమోదు చూస్తూ ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే కొత్త లాంచ్‌లతో కస్టమర్లకు ఆకర్షిస్తోంది. ఇక ఇప్పుడు.. ఎంజీ హెక్టార్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను తీసుకొచ్చింది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఎంజీ హెక్టార్ అప్డేటెడ్ వర్షెన్..
2019లో హెక్టార్ మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది ఎంజీ మోటార్. ఈ సంస్థ నుంచి ఇండియాలో వచ్చిన మొదటి ప్రాడెక్ట్ ఇదే. కొన్ని రోజుల్లోనే మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ కనిపించింది. సెకెండ్ జెన్ క్రేటా, గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌తో పాటు త్రీ రో ఎస్‌యూవీలు ఎక్స్‌యూవీ700, సఫారీకి కూడా ఇది పోటీనిస్తోంది.
2023 MG Hector : ఇక 2023 ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ ఫస్ట్ లుక్ ఆదివారమే బయటకొచ్చింది. లుక్స్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి. ఈ హెక్టార్ మోడల్‌కు సంబంధించిన ధరలను త్వరలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో ప్రకటించనుంది ఎంజీ మోటార్.
కొత్త ఎంజీ హెక్టార్లో గ్రిల్స్ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. పాత మోడల్‌తో పోల్చుకుంటే సైజ్‌లోనూ పెద్దగా ఉన్నాయి. వీటిని 'ఆగ్రీలీ ఇన్స్పైర్డ్ డైమండ్ మెష్ గ్రిల్' అని పిలిస్తోంది ఎంజీ మోటార్. లెక్సస్ మోడల్స్‌తో ఈ గ్రిల్స్ పోలి ఉన్నాయి.
2023 MG Hector facelift features : 2023 ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది. పాత మోడల్లోనూ ఇలాగే ఉండేది. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో కూడిన టాప్ పార్ట్ కూడా మారలేదు. ఫ్రెంట్ బంపర్‌కు మాత్రం డిజైన్ పరంగా స్వల్ప మార్పులు చేసింది ఆటో సంస్థ. కానీ దృష్టి పెట్టి చూస్తే తప్ప ఈ డిఫరెన్స్ కనిపించదు!
ఈ కొత్త ఎంజీ హెక్టార్లో ఆలాయ్ వీల్స్.. పాత దానితో పోలి ఉన్నాయి. రేర్‌లో మాత్రం కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ విత్ న్యూ ఇన్సర్టర్స్ వస్తున్నాయి. షేప్ మాత్రం పాత వర్షెన్‌తో పోలి ఉంది.
2023 MG Hector facelift auto expo 2023 : ఇక 2023 ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్ విషయానికొస్తే.. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కొత్తగా ఉంది. పాత మోడల్లో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఉండగా.. ఇప్పుడది 14 ఇంచ్‌కు పెరిగింది. ఈసారి ఫుల్ హెచ్డీ కూడా లభిస్తోంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా కూడా ఉంది. ఇది 3డీ మోడ్‌లో కూడా వస్తుండటం విశేషం.
కొత్త ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్‌లో ఏడీఏఎస్ ఫీచర్‌ను యాడ్ చేశారు. క్రూయిజ్ కంట్రోల్ ఆన్‌లో ఉన్నప్పుడు.. కర్వ్డ్ రోడ్డు వస్తే.. వెహికిల్ దాని అంతట అదే స్పీడ్‌ను అడ్జెస్ట్ చేసుకునే ఆప్షన్ ఇది. ట్రాఫిక్ జామ్ అసిస్ట్ ఫీచర్ కూడా వస్తోంది. బ్లూటూత్ ఎనేబుల్డ్ యాక్సెస్ కూడా కొత్తగా వచ్చింది. ఈసారి ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చింది సంస్థ.
2023 ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్..
2023 ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజిన్ ఆప్షన్ మారలేదు. ఇందులో 1.5లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. కాగా.. 5స్పీడ్ మేన్యువల్ లేదా సీవీటీ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉంటాయి. మైల్డ్ హైబ్రీడ్ టెక్ లేదు. 7స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌ని కూడా తప్పించారు.
డీజిల్ ఇంజిన్ కూడా మారలేదు. 170హెచ్‌పీ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తోనే 2023 ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.
2023 ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్..
2023 MG Hector facelift bookings : 2023 ఆటో ఎక్స్పో తర్వాత.. ఈ 2023 ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది.