Honda CB200X: 2023 మోడల్ సీబీ200 ఎక్స్ ను లాంచ్ చేసిన హోండా
15 September 2023, 19:45 IST
Honda CB200X: 2023 మోడల్ సీబీ 200 ఎక్స్ ను హోండా మోటార్స్ లాంచ్ చేసింది. ఇది బీఎస్ 6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తి చేయబడింది.
2023 మోడల్ సీబీ 200 ఎక్స్
Honda CB200X: హోండా సీబీ 200 ఎక్స్ ను హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) సంస్థ లాంచ్ చేసింది. ఈ బైక్ బీఎస్ 6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా, ఓబీడీ2, ఈ 20 నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తి చేయబడింది. 2023 మోడల్ హోండా హార్నెట్ (Honda Hornet) కూడా ఈ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.
ధర ఎంత?
2023 మోడల్ సీబీ 200 ఎక్స్ మోటార్ సైకిల్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.47 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్ లో 184.4 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,500 ఆర్పీఎం వద్ద 17 బీహెచ్పీ పవర్ ను, 6,000 ఆర్పీఎం వద్ద 15.9 పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇతర స్పెసిఫికేషన్స్ లో.. యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనో షాక్ అబ్సార్బర్స్, రెండు వైపులా సింగిల్ చానెల్ ఏబీఎస్ తో డిస్క్ బ్రేక్ సిస్టమ్.. మొదలైనవి ఉన్నాయి.
డిజైన్ లో మార్పులు
డిజైన్ పరంగా 2023 సీబీ 200 ఎక్స్ లో చాలా మార్పులు చేశారు. సీబీ 500 ఎక్స్ తరహాలో దీనిని తీర్చిదిద్దారు. ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ ను చేర్చారు. ఈ బైక్ నైట్ స్టార్ బ్లాక్, స్పోర్ట్స్ రెడ్, బ్లూ మెటాలిక్ కలర్స్ లో లభిస్తుంది. ఈ బైక్ కు అదనంగా, ప్రత్యేకంగా 10 ఏళ్ల వారంటీని సంస్థ అందిస్తోంది. ఇప్పటివరకు సీబీ 200 ఎక్స్ కు కస్టమర్లు ముఖ్యంగా యూత్ నుంచి వస్తున్న ఆదరణ కొనసాగుతుందని ఆశిస్తున్నామని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) సంస్థ ఎండీ, సీఈఓ సుత్సుము ఒటానీ వ్యాఖ్యానించారు.