తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  West Godavari News : ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాలో అమానుష ఘటన, మద్యం మత్తులో గేదేపై అత్యాచారం-కలెక్టర్ ఆదేశాలతో కేసు నమోదు

West Godavari News : ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాలో అమానుష ఘటన, మద్యం మత్తులో గేదేపై అత్యాచారం-కలెక్టర్ ఆదేశాలతో కేసు నమోదు

HT Telugu Desk HT Telugu

17 July 2024, 15:37 IST

google News
    • West Godavari News : పశ్చిమ గోదావరి జిల్లాలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం సేవించిన కొందరు గేదే కాళ్లను కట్టి అత్యాచారం చేశారు. గేదే యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వెటర్నరీ వైద్యులు గేదే నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు.
ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాలో అమానుష ఘటన, మద్యం మత్తులో గేదేపై అత్యాచారం
ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాలో అమానుష ఘటన, మద్యం మత్తులో గేదేపై అత్యాచారం

ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాలో అమానుష ఘటన, మద్యం మత్తులో గేదేపై అత్యాచారం

West Godavari News : ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో విచిత్ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. పుల్‌గా మ‌ద్యం చేవించిన మందుబాబులు కొయ్యకు క‌ట్టి ఉన్న గేదేను అత్యాచారం చేశారు. గేదే య‌జ‌మాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచార‌ణ జ‌రుపుతున్నారు. అలాగే వెట‌ర్నరీ డాక్టర్లు గేదేకు వైద్య ప‌రీక్షలు చేశారు. అలాగే శాంపిల్స్ సేక‌రించి ల్యాబ్‌కు పంపారు. ఈ ఘోర ఘ‌ట‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వీర‌వాస‌రం మండలం తోక‌ల‌పూడి గ్రామంలో చోటు చేసుకుంది. గ‌త‌వారంలో జరిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. పాలు ఇచ్చే గేదేను దుర్మార్గులు అత్యాచారం చేశారు. తోక‌ల‌పూడి గ్రామంలో రైతు పిల్లి సీతారామ‌య్యకు గేదేలు ఉన్నాయి. అయితే రాత్రి వేళ‌ల మద్యం సేవించ‌డానికి అటుగా వెళ్లిన కొంత‌మంది, మ‌ద్యం సేవించి కొయ్యకు క‌ట్టి ఉన్న గేదేపై ఈ అత్యాచార ఘ‌ట‌న‌కు పాల్పడ్డారు. దీంతో ఉద‌యం గేదే లేవ‌లేకపోయింది.

గేదే య‌జ‌మాని సీతారామ‌య్య రోజులానే అక్కడికి చేరుకున్నారు. గేదే లేవ‌లేక పోవడాని చూసి ఏం జ‌రిగిందో తెలియ‌లేదు. దీంతో మెల్లగా ప‌శువుల సాలలోప‌లి నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. వెటర్నరీ డాక్టర్‌కు ఫోన్ చేస్తే, ఆయన వచ్చి వైద్యం అందించారు. గేదేకు డాక్టర్ ఐదు రోజులు ఐదు ఇంజెక్షన్‌లు ఇచ్చారు. అనంత‌రం ఇంకా ఎక్కువ ఇంజెక్షన్లు చేస్తే పాలు ఇవ్వద‌ని డాక్టర్ తెలిపారు. దీంతో మార్టేరు వెళ్లి అక్కడ హోమియోప‌తి డాక్టర్ వ‌ద్ద నుంచి మందులు తెచ్చి గేదేకు ఇస్తున్నారు. గేదేను ప‌డ‌గొట్టి, రెండు కాళ్లకు గ‌ట్టిగా తాడుతో క‌ట్టి అత్యాచారం చేశార‌ని రైతు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ర‌క్త స్రావం జ‌రిగింద‌ని, మ‌నిషి గోళ్ల గంట్లు ఉన్నాయ‌ని తెలిపారు. కాళ్లకు తాడుతో క‌ట్టడంతో గేదే కాళ్లకు తీవ్ర గాయ‌మైంద‌ని తెలిపారు.

భీమ‌వ‌రంలో ఉన్న కుమారుడికి సీతారామ‌య్య ఫోన్ చేసి, జ‌రిగిన విష‌యం చెబితే, ఆయ‌న‌కు ఖాళీ లేక రెండు రోజుల త‌రువాత వ‌చ్చాడు. ఆయ‌న ఆదివారం వీర‌వాస‌రం పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయిన‌ప్పటికీ పోలీసులు ప‌ట్టించుకోక‌పోతే, క‌లెక్టర్ కార్యాల‌యానికి వెళ్లి, క‌లెక్టర్‌కు ఫిర్యాదు చేశామ‌ని సీతారామ‌య్య తెలిపారు. అప్పుడు ప‌శువుల డాక్టర్‌ను పంపిస్తాన‌ని క‌లెక్టర్ హామీ ఇవ్వడంతో తాను వెన‌క్కి వ‌చ్చేశాన‌ని సీతారామ‌య్య తెలిపారు. క‌లెక్టర్ ఆదేశాల మేర‌కు సీఐ, ఎస్ఐ నేతృత్వంలోని పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. మందు తాగి కొంత మంది గేదేను అత్యాచారం చేశార‌ని, తెల్లవారి వ‌చ్చి చూసేస‌రికి గేదేకు గాయాలు అయి ఉన్నాయ‌ని సీఐ, ఎస్ఐకి సీతారామ‌య్య వివ‌రించారు. తాను పశువుల డాక్టర్‌కి ఫోన్ చేశాన‌ని, ఆయ‌న వ‌చ్చి గేదేను క‌ట్టేసి అత్యాచారం చేసిన‌ట్లు క‌న‌బ‌డుతుంద‌ని చెప్పినట్లు ఎస్ఐకి తెలిపారు. గంజాయి, మందు తాగినోళ్లే ఈ ప‌ని చేశార‌ని ఆరోపించారు. ఇక్కడ స‌మీపంలో ఒక సైట్ ఉంద‌ని, అందులో రాత్రి తొమ్మిది గంట‌ల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వ‌ర‌కు కుర్రోళ్లు మందుతాగుతార‌ని రైతు వివ‌రించాడు.

సీఐ పశువుల ఆసుప‌త్రికి స‌మాచారం ఇచ్చారు. దీంతో ప‌శువుల డాక్టర్‌, ఇత‌ర సిబ్బంది కూడా అక్కడి చేరుకున్నారు. వారు గేదేను ప‌రిశీలించారు. గేదే శాంపిల్స్ తీసుకున్నారు. కొన్ని ఫొటోలు కూడా తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా సీఐ మాట్లాడుతూ గాయ‌ప‌డిన గేదేను స్థానిక వెట‌ర్నరీ డాక్టర్ పరిశీలించార‌ని, రిపోర్టు వ‌చ్చిన త‌రువాత ఈ చ‌ర్యకు పాల్పడిన వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. వారిపై చ‌ట్టప‌రమైన చ‌ర్యలు తీసుకుంటామ‌ని, కేసు న‌మోదు చేస్తామ‌ని అన్నారు.

జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం