Vizag Port : విశాఖపట్నంలో అమెరికా నేవీ యుద్ధనౌక 'ఫ్రాంక్ కేబుల్'
04 August 2022, 7:46 IST
- యునైటెడ్ స్టేట్స్ వార్‌షిప్ ఫ్రాంక్ కేబుల్ ఏఎస్ 40 జలాంతర్గామి నౌక విశాఖపట్నం ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌక ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రత్యేకించి US 7వ నౌకాదళం యొక్క ఆపరేషన్ ప్రాంతంలో విస్తరించి ఉంది.
ఫ్రాంక్ కేబుల్ ఏఎస్ 40
యుద్ధనౌక ‘ఫ్రాంక్ కేబుల్’ విశాఖ చేరుకుంది. జలాంతర్గాములను మద్దతుగా నిలిచే.. సమగ్ర సదుపాయాలతో కూడిన అమెరికా నేవీ వార్‌షిప్ ఫ్రాంక్ కేబుల్ ఏఎస్40 మన ఓడరేవుకు వచ్చింది. LI స్పియర్ సిరీస్‌కు చెందిన ఈ నౌక 1979లో US నావికాదళంలో ప్రవేశపెట్టారు. కాలానుగుణంగా.. మార్పులు చేస్తూ.. ఆధునికీకరించారు.
నౌకలోని సిబ్బంది విశాఖకు చేరుకుని భారత నావికాదళ అధికారులతో మాట్లాడారు. ఫ్రాంక్ కేబుల్ నౌక నుంచి.. జలాంతర్గామి మధ్య రవాణాను సులభతరం చేయడం దీని ప్రత్యేకత. అవసరమైన మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉన్న నలుగురు డైవర్లతో ఉన్నారు. మరోవైపు.. మానవరహిత మిషన్లను సెట్ చేసేందుకు ఇందులో రోబోట్ ఉపయోగిస్తున్నారు. లాక్‌హీడ్ షిప్‌బిల్డింగ్ కంపెనీ తయారు చేసిన ఈ యుద్ధనౌక ఒకేసారి నాలుగు జలాంతర్గాములకు సేవలందించేలా రూపొందించారు.
'భారత నౌకాదళంతో స్నేహపూర్వక సంబంధాలను మరింత మెరుగుపరచడం. సాంకేతిక అవగాహన పెంచడం మా పర్యటన ప్రధాన లక్ష్యం. అవసరమైనప్పుడు సమన్వయంతో విధులను నిర్వహించడానికి రెండు నౌకాదళాల అధికారులు సిద్ధంగా ఉంటారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఇరు దేశాలు మరింత పట్టు సాధించగలవు. తొలిసారిగా విశాఖపట్నం సందర్శించడం ఆనందంగా ఉంది. నాలుగో తేదీ వరకు ఇక్కడే ఉంటాం.' అని అమెరికా నేవీ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ చుంగ్ తెలిపారు.
యునైటెడ్ స్టేట్స్, భారతదేశం రక్షణ సంబంధాల విషయంలో వేగాన్ని పెంచాయి. 2+2 సంభాషణ కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఇరు దేశాల అధికారుల మధ్య ఉన్నత స్థాయి పర్యటనలు ఉన్నాయి.
ఇండియన్ నేవీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో ఫ్రాంక్ కేబుల్ వంటి జలాంతర్గామి టెండర్ షిప్ లేదు. INS అంబా 2006లో ఉపసంహరించారు. భారతదేశం భవిష్యత్తులో అలాంటి నౌకలను కలిగి ఉండాలని యోచిస్తోంది. అందులో ఫ్రాంక్ కేబుల్ సందర్శన కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాజెక్ట్ 75 కింద సుమారు ఆరు సాంప్రదాయ జలాంతర్గాములు రెండీ అవుతున్నాయి. . రెండు అరిహంత్-తరగతి అణు జలాంతర్గాములు S3, S4 పూర్తయ్యే దశలో ఉన్నాయి.