Indian Navy Agniveer Recruitment :10వ తరగతి అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు!
14 July 2022, 14:43 IST
- అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ నేవీలో ఎంఆర్ అగ్నివీర్స్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నేవీ MRలో 200 పోస్టుల కోసం అవివాహిత పురుష, స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Indian Navy Agniveer Recruitment 2022
అగ్నిపథ్ పథకం కింద, ఇండియన్ నేవీలో MR అగ్నివీర్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. నేవీ MR పోస్టుల కోసం అవివాహిత పురుష, స్త్రీ అభ్యర్థుల నుండి ఇండియన్ నేవీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు joinindiannavy.gov.in ని సందర్శించడం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులైన యువత అగ్నివీర్ MR పోస్టులకు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.జూలై 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఇండియన్ నేవీలో అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ SSR , అగ్నివీర్ MRపోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరుగుతుంది . ఇండియన్ నేవీ SSR రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
అగ్నివీర్ MR అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి - అభ్యర్తి వయసు 17 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే, అభ్యర్థి 1 డిసెంబర్ 1999 నుండి 31 మే 2005 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ముందుగా అభ్యర్థులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులను PFT అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ కోసం పిలుస్తారు.వ్రాత పరీక్షలో పొందిన మార్కులు, PFT అర్హత ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది.
ఫిజికల్ టెస్ట్
పురుషులు 6.30 నిమిషాల్లో 1.6 కి.మీ. 20 స్క్వాట్‌లు, 12 పుషప్‌లు కొట్టాలి.
మహిళలు 8 నిమిషాల్లో 1.6 కి.మీ.15 ఉత్తక్ సిట్-అప్‌లు మరియు 10 బెంట్ మోకాలి సిట్ అప్‌లు చేయాల్సి ఉంటుంది.
ఎత్తు:
మగ - 157 సెం.మీ.
స్త్రీ - 152 సెం.మీ
ఎలా దరఖాస్తు చేయాలి
- ముందుగా joinindiannavy.gov.in ని సందర్శించండి. మీరు ఇంతకు ముందు పేరు నమోదు చేసుకోకుంటే, రిజిస్ట్రేషన్ సమయంలో మీ ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్‌ను నమోదు చేపి లాగిన్ అవ్వొచ్చు.
రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత.""Current Opportunities" పై క్లిక్ చేయండి. అనంతరం apply బటన్‌పై క్లిక్ చేయండి. దరఖాస్తు ఫారమ్‌ను పూరించి applyపై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు మీరు అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి.కాబట్టి వాటిని ముందుగా స్కాన్ చేసి ఉంచుకోండి.
ఫోటోను అప్‌లోడ్ చేసే ముందు, క్వాలీటి, Blue Background ఉండేలా చూసుకోండి.
టాపిక్