తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఇకపై మీకోసం 'మొబైల్ కంటెనర్స్'

Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఇకపై మీకోసం 'మొబైల్ కంటెనర్స్'

27 July 2023, 17:57 IST

    • TTD Latest News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా మొబైల్ కంటెనర్లను ప్రారంభించింది. వీటిని విశాఖకు చెందిన దాత శ్రీ మూర్తి విరాళంగా అందజేశారు.
మొబైల్ కంటైనర్లను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్
మొబైల్ కంటైనర్లను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్

మొబైల్ కంటైనర్లను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్

Mobile Containers in Tirumala: తిరుమలలో భక్తుల సౌకర్యం కోసమ సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా మొబైల్ కంటెనర్లను ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం. వీటిని విశాఖకు చెందిన దాత శ్రీ మూర్తి విరాళంగా అందజేశారు. ఈ మేరకు గురువారం రెండు మొబైల్ కంటైనర్లను టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి.. ఈవో ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఒక కంటైనర్ ను జిఎన్సీ వద్దగల టీటీడీ ట్రాన్సుపోర్టు డిపోలో విధులు ముగించుకుని డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు కేటాయించారు. మరో కంటైనర్ ను రాంభగీచా -3 ఎదురుగా ఏర్పాటు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ... తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉందన్నారు. నూతన విశ్రాంతి గదుల నిర్మాణానికి అనుమతి లేదని చెప్పారు. పలుచోట్ల ఉన్న పాత విశ్రాంతి గృహాలను పునర్నిర్మాణం చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలో మొబైల్ కంటైనర్లను దాత అందించారని, ఇందులో భక్తులు బస చేసేందుకు పరుపులు, స్నానపు గది, మరుగుదొడ్లు ఉన్నాయని చెప్పారు. ఈ కంటైనర్ల విలువ దాదాపు రూ.25 లక్షలు అని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగించుకునేందుకు వీలుగా రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.

కొత్త విశ్రాంతి గృహాం ప్రారంభం

తిరుమలలో అన్నమయ్య భవనం ఎదురుగా నిర్మించిన కావేరి విశ్రాంతి గృహాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఈవోధర్మారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. హైదరాబాద్ స్థానిక సలహా మండలి అధ్యక్షులు భాస్కర్ రావు విరాళంతో ఈ విశ్రాంతి గృహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఛైర్మన్, ఈవోను దాత ఘనంగా సత్కరించారు.

మొబైల్ కంటైనర్ లోపలి భాగం

శ్రీవారి పుష్క‌రిణి మూత…

CLOSURE OF SRIVARI PUSHKARNI: తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్క‌రిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్క‌రిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి ఉండ‌దు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

సాధారణంగా స్వామి పుష్క‌రిణిలో నీరు నిల్వ ఉండే అవ‌కాశం లేదు. పుష్క‌రిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్త‌మ రీసైక్లింగ్ వ్య‌వ‌స్థ‌ అందుబాటులో ఉంది. నిరంత‌రాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్క‌రిణిలో నీటిని తొల‌గించి చిన్న చిన్న మ‌ర‌మ్మ‌తుల‌ను పూర్తి చేస్తారు.

పుష్క‌రిణి మ‌ర‌మ్మ‌తుల కోసం మొద‌టి ప‌ది రోజుల పాటు నీటిని తొల‌గిస్తారు. ఆ త‌రువాత ప‌ది రోజులు మ‌ర‌మ్మ‌తులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివ‌రి ప‌ది రోజులు పుష్క‌రిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్క‌రిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు.

తదుపరి వ్యాసం