తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srisailam Project Updates : భారీగా కొనసాగుతున్న వరద - శ్రీశైలంలో 860 అడుగులు దాటిన నీటిమట్టం, తాజా వివరాలివే

Srisailam Project Updates : భారీగా కొనసాగుతున్న వరద - శ్రీశైలంలో 860 అడుగులు దాటిన నీటిమట్టం, తాజా వివరాలివే

26 July 2024, 15:43 IST

google News
    • Krishna River Updates: కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి చేరే వరద క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 860 అడుగులు దాటింది.
శ్రీశైలం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)
శ్రీశైలం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో) (Photo source From Twitter)

శ్రీశైలం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)

 Srisailam Project Water Levels: కొద్దిరోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు… మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా వరద నీరు వస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కృష్ణమ్మ జోరుగా పొంగిపోర్లుతుంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. 

ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది., దీంతో జురాల, శ్రీశైలం ప్రాజెక్ట్ లకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 

ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది.  శుక్రవారం (జులై 26) మధ్యాహ్నం 3:20 రిపోర్ట్ ప్రకారం…. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 860.4కు చేరింది. నీటినిల్వ 107.19 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి 2,11,208 క్యూసెక్కుల వరద వస్తుండగా…ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో… నీటినిల్వలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్‌ నిండడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో డ్యామ్‌ నిండాలంటే 885 అడుగులకు నీరు చేరాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

సాధారణంగా భారీ వర్షాల నేపథ్యంలో.. శ్రీశైలంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారని టూరిస్టులు ఎదురుచూస్తూ ఉంటారు. గేట్లు ఎత్తినప్పుడు.. భారీ స్థాయిలో పర్యాటకులు తరలివస్తారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే కృష్ణా నది తీర ప్రాంత అందాలను చూసేందుకు క్యూ కడుతున్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఇలా…..

ఇక నాగార్జున సాగర్ లో చూస్తే శుక్రవారం మధ్యాహ్నం 3:20 రిపోర్ట్ ప్రకారం …. 505 గా నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 123.34  టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 29,589గా ఉండగా…  6,990 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. ప్రస్తుతం 102.82 అడుగుల నీటిమట్టం ఉంది. 1.03 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 277 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… ఔట్ ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత… గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది.

NOTE : ఎగువ నుంచి వస్తున్న వరదతో ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిల్వల గణాంకాలు మారుతుంటాయి. ఆ వివరాలను https://apwrims.ap.gov.in/mis/reservoir/  లింక్ పై క్లిక్ చేసి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను తెలుసుకోవచ్చు.

తదుపరి వ్యాసం