తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srisailam Temple : సెప్టెంబర్ 26 నుంచి దసరా మహోత్సవాలు

Srisailam Temple : సెప్టెంబర్ 26 నుంచి దసరా మహోత్సవాలు

HT Telugu Desk HT Telugu

08 September 2022, 18:06 IST

    • Srisailam Mallanna Temple : రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు దసరా మహోత్సవాలకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైల మల్లన్న దేవస్థానంలో సెప్టెంబర్ 26 నుంచి దసరా మహోత్సవాలు జరగనున్నాయి.
శ్రీశైలం దసరా మహోత్సవాలు
శ్రీశైలం దసరా మహోత్సవాలు

శ్రీశైలం దసరా మహోత్సవాలు

దసరా మహోత్సవాలకు శ్రీశైలం మల్లన ఆలయం రెడీ అవుతోంది. సెప్టెంబర్ 26 నుంచి శ్రీశైలం ఆలయ దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నట్టుగా ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Akhila Priya Bodyguard Attacked : అఖిల ప్రియ బాడీగార్డ్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-ఐదుగురిపై కేసు నమోదు

Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్లకు వాహన సేవలపై గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈవో లవన్న తెలిపారు.

బెజ‌వాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా ఉత్సవాల‌ను నిర్వహించేందుకు ఆల‌య వైదిక క‌మిటీ నిర్ణయించింది. అమ్మవారి అలంకారాల‌కు సంబంధించి అధికారులు మాట్లాడారు. దసరా ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాల‌ని జిల్లా క‌లెక్టర్ ఢిల్లీ రావు అన్నారు.

భక్తులకు ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు జారీ చేయడం, క్యూ లైన్ల ఏర్పాటు, విద్యుత్ దీపాల అలంకరణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి విషయాలపై దృష్టి పెట్టాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశించారు. ఉచిత అన్నదానం, ప్రసాదంతోపాటు అవసరమైన ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఇంద్రకీలాద్రిపై.. భక్తులకు చేస్తున్న ఏర్పాట్లపై.. ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలన్నారు.

దసరా ఉత్సవాల కోసం వచ్చే భక్తుల కోసం.. కొండపైన దిగువున సూచక బోర్డులను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు చేయాలని కలెక్టర్ అన్నారు. పోలీస్, రెవెన్యూ , మున్సిపల్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక , ఇరిగేషన్, మత్స్య ,ఆర్అండ్ బీ, పీడబ్ల్యూడీ సమాచార పౌర సంబంధాలు అధికారుల సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమన్వయ కమిటీ సమావేశం త్వరలో ఉంటుందని.. కలెక్టర్ అన్నారు.

బెజవాడ ద‌స‌రా ఉత్సవాలకు ఎక్కడెక్కడి నుంచో తెలుగు ప్రజ‌లు అమ్మవారిని ద‌ర్శించుకునేందుకు వస్తారు. ఈ ఏడాది ప‌ది రోజుల పాటు ద‌స‌రా ఉత్సవాలను జరుగుతాయి. తిధుల్లో వ‌చ్చిన హెచ్చుత‌గ్గులు కార‌ణంగా ఈ సారి ప‌ది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ రోడ్ మీద కొండరాళ్లు దొర్లిప‌డ‌కుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తదుపరి వ్యాసం