Nani: 'దసరా' కొత్త పోస్టర్ విడుదల.. సుదీర్ఘ షెడ్యూల్ ప్రారంభం-nani new movie dasara long schedule begin from july 1 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani: 'దసరా' కొత్త పోస్టర్ విడుదల.. సుదీర్ఘ షెడ్యూల్ ప్రారంభం

Nani: 'దసరా' కొత్త పోస్టర్ విడుదల.. సుదీర్ఘ షెడ్యూల్ ప్రారంభం

Maragani Govardhan HT Telugu
Jul 01, 2022 06:00 PM IST

నాని నటిస్తోన్న తాజా చిత్రం దసరా. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. జులై 1 నుంచి సుదీర్ఘ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలియజేసింది.

దసరాలో నాని
దసరాలో నాని (Twitter)

Nani Dasara Movie: నేచురల్ స్టార్ ఇటీవలే అంటే సుందరానికి.. అనే చిత్రంతో థియేటర్లలో సందడి చేశారు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం తన పాన్ఇండియా సినిమా దసరా కోసం సిద్ధపడుతున్నారు నాని. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా చేస్తుంది. రూరల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ మార్చిలోనే ప్రారంభం కాగా.. ఇటీవల అంటే సుందరానికి విడుదల సందర్భంగా కాస్త బ్రేక్ పడింది. తాజాగా జులై 1 నుంచి అంటే శుక్రవారం నుంచి ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది. ఈ విషయాన్ని నాని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.

“సుదీర్ఘ షెడ్యూల్ ప్రారంభమైంది” అంటూ నాని దసరా చిత్ర కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో నాని లుంగీ కట్టుకుని రా లుక్‌తో కనిపిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా విడుదలయ్యే అవకాశముంది. ఫిబ్రవరి 16న ఈ చిత్రం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైది. సింగరేణి బొగ్గుగనుల ప్రధానంగా ఈ చిత్ర కథాంశం ఉండబోతన్నట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ ఓదెల్ల దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు నాని. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. తొలిసారిగా నాని ఈ చిత్రం కోసం తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత్రంలో సముద్ర ఖని, జరీనా వాహెబ్, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ఇంతకు ముందు నాని, కీర్తి సురేశ్ ఇద్దరూ కలిసి నేను లోకల్ అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా విజయం సాధించడంతో 'దసరా' చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్