Yadadri: ఇదేంది స్వామి.. ఒక్క వర్షానికే కుంగిపోయిన యాదాద్రి ఘాట్ రోడ్డు-damage newly built roads in yadadri due to heavy rainfall ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadadri: ఇదేంది స్వామి.. ఒక్క వర్షానికే కుంగిపోయిన యాదాద్రి ఘాట్ రోడ్డు

Yadadri: ఇదేంది స్వామి.. ఒక్క వర్షానికే కుంగిపోయిన యాదాద్రి ఘాట్ రోడ్డు

HT Telugu Desk HT Telugu
May 04, 2022 12:55 PM IST

ప్రముఖ అధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదాద్రిలో వర్షం బీభత్సం సృష్టించింది. అయితే ఘాట్ రోడ్డులో కొత్తగా వేసిన రోడ్డు కుంగిపోయింది. ఫలితంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యాదాద్రిలో కుంగిపోయిన రోడ్డు
యాదాద్రిలో కుంగిపోయిన రోడ్డు

Yadadri Ghat Road Damage: యాదాద్రిలో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి కుండపోతగా పడింది. ఫలితంగా గుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. అయితే యాదాద్రి కొండపై నుంచి కిందికి కొత్తగా నిర్మించిన రోడ్డు మార్గం కుంగిపోయింది. పలు చోట్ల కుంగిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజా పరిణామాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక్క వర్షానేకి రోడ్లు కుంగిపోవటమేంటని భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో నాణ్యత పాటించకపోవటం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. మరోవైపు కొండపై క్యూకాంప్లెక్స్‌లోకి కూడా వర్షపు నీరు చేరింది. ఇక పలువురు భక్తులు కొండపైకి కాలినడకన వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పార్కింగ్ పేరుతో గంటకు రూ.500 వసూలు చేయటంపై దృష్టి పెట్టిన అధికారులు.. ఇలాంటి వాటిపై పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. ఇక యాదగిరిగుట్ట బస్టాండ్‌ ప్రాంగణం వర్షపు నీళ్లతో నిండిపోయింది.

<p>ఘాట్ రోడ్డులోని దృశ్యం</p>
ఘాట్ రోడ్డులోని దృశ్యం (Twitter)

ఇక హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురుసింది. తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది,ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బేగంపేట్‌, సైదాబాద్‌, చంపాపేట, సరూర్‌నగర్‌, కొత్తపేట, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో.. రోడ్లన్నీ జలమయమయ్యాయి.

భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌ కూడలి వద్ద మోకాళ్ల లోతులో నీరు చేరిన పరిస్థితి ఏర్పడింది. పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. యూసఫ్‌గూడలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. నగర శివారులోనూ వర్షం పడింది. ఫలితంగా ఎండవేడిమితో అల్లాడుతున్న నగర ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించినట్లైంది. అయితే ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. దాదాపు 3 గంటలకు పైగా వర్షం కురవటంతో పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. మరోవైపు పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

 

IPL_Entry_Point

టాపిక్