SCR Sabarimala Special Trains :శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాల నుంచి 62 ప్రత్యేక రైళ్లు
25 November 2024, 23:02 IST
SCR Sabarimala Special Trains : ఏపీ, తెలంగాణ నుంచి శబరిమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఇరు రాష్ట్రాల నుంచి మొత్తం 62 సర్వీసులను శబరిమలకు నడుపున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాల నుంచి 62 ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తెలంగాణ, ఏపీ మీదుగా 62 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, కాచిగూడ, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్ నుంచి కొల్లం, కొట్టాయంలకు భారీగా స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది.
శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు
శబరిమల యాత్రికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే 18 శబరిమల ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
1. రైలు నెం. 07133 : కాచిగూడ నుంచి కొట్టాయం - డిసెంబర్ 5, 12, 19 & 26 తేదీల్లో
2. రైలు నెం. 07134 : కొట్టాయం నుంచి కాచిగూడ - డిసెంబర్ 6, 13, 20 & 27 తేదీల్లో
3. రైలు నెం.07135 : హైదరాబాద్ నుంచి కొట్టాయం - డిసెంబర్ 3, 10, 17, 24 & 31 తేదీల్లో
4. రైలు నెం.07136 : కొట్టాయం - హైదరాబాద్ - డిసెంబర్ 4, 11, 18 & 25, జనవరి 1వ తేదీలో
1. రైలు నం. 07133/07134 : కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ (08 సేవలు) :
ఈ ప్రత్యేక రైళ్లు షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, కోయంబత్తూరు, పోడన్, తిరుప్పూర్, పోదనూర్, పాలక్కాడ్, త్రిసూర్, ఎర్నాకులం స్టేషన్లలో రెండు మార్గాల్లో ఆగుతాయి.
2. రైలు నెం. 07135/07136 హైదరాబాద్ - కొట్టాయం - హైదరాబాద్ స్పెషల్స్ (10 సర్వీసులు):
ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు, సీరం, యాద్గీర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, జోలార్‌పేటలో ఆగుతాయి. తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్ స్టేషన్లలో రెండు మార్గాల్లో ఆగుతాయి.
44 శబరిమల ప్రత్యేక రైళ్లు
శబరిమల ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విశాఖపట్నం-కొల్లాం, శ్రీకాకుళం రోడ్ - కొల్లాం మధ్య 44 శబరిమల ప్రత్యేక రైళ్లు సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతోంది. -
1. 08539- విశాఖపట్నం నుంచి కొల్లాం - 04.12.2024 నుంచి 26.02.2025 వరకు ప్రతి బుధవారం
2. 08540-కొల్లాం నుంచి విశాఖపట్నం -05.12.2024 నుంచి 27.02.2025 వరకు ప్రతి గురువారం
3. 08553-శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లాం - 01.12.2024 నుంచి 26.01.2025 వరకు ప్రతి ఆదివారం
4. 08554-కొల్లాం నుంచి శ్రీకాకుళం రోడ్డు - 02.12.2024 నుంచి 27.01.2025 వరకు ప్రతి సోమవారం
1. రైలు నెం. 08539/08540 -విశాఖపట్నం - కొల్లాం - విశాఖపట్నం (26 సర్వీసులు):
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు. నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూరు, పాలక్కాడ్. త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం రోడ్, కొట్టాయం, చెంగనచేరి, తిరువల్ల. చెంగన్నూరు, మావేలికెర కాయంకుళం స్టేషన్‌లు ఇరువైపులా ఆగుతాయి.
2. రైలు నెం. 08553/08554 -శ్రీకాకుళం రోడ్ - కొల్లాం - శ్రీకాకుళం రోడ్ స్పెషల్స్ (18 సర్వీసులు):
ఈ ప్రత్యేక రైళ్లు పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్ పోడన్, తిరుప్పూర్ పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, ఎట్టుమనూర్, కొట్టాయం, చెంగనచేరి, తిరువళ్ల, చెంగన్నూర్, మావేలికెర, కాయంకుళం స్టేషన్‌లు ఇరువైపులా ఆగుతాయి.