తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌ - శ్రీకాకుళం నుంచి ప్రత్యేక రైళ్లు, మరికొన్ని పొడిగింపు

Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌ - శ్రీకాకుళం నుంచి ప్రత్యేక రైళ్లు, మరికొన్ని పొడిగింపు

HT Telugu Desk HT Telugu

23 November 2024, 10:09 IST

google News
    • అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. శ్రీకాకుళం-కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు  విశాఖపట్నం-కొల్లాం మధ్య నడుస్తున్న స్పెష‌ల్ రైళ్లను పొడిగించారు.
శ్రీకాకుళం-కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లు
శ్రీకాకుళం-కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లు

శ్రీకాకుళం-కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లు

అయ్య‌ప్ప భ‌క్తుల‌కు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజ‌న్ గుడ్‌న్యూస్ చెప్పింది. స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌త్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయ్యప్ప భక్తుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రీకాకుళం-కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణ‌యించింది. అలాగే విశాఖపట్నం-కొల్లాం స్పెషల్ సర్వీసులను పొడిగించాలని నిర్ణయించింది.

స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు:

1. శ్రీకాకుళం రోడ్‌లో బ‌య‌లుదేరే శ్రీకాకుళం రోడ్-కొల్లాం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08553) రైలు 2024 డిసెంబర్ 1 నుండి 2025 జనవరి 26 వరకు అందుబాటులోకి రానుంది. రైలు ఆదివారాల్లో ఉద‌యం 6.00 గంటలకు శ్రీ‌కాకుళం రోడ్డు నుంచి బ‌య‌లుదేరుతుంది. మ‌రుస‌టి రోజు సోమవారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు కొల్లాం చేరుకుంటుంది.

2. కొల్లాంలో బ‌య‌లుదేరే కొల్లాం-శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08554) రైలు 2024 డిసెంబర్ 2 నుండి 2025 జనవరి 27 వరకు అందుబాటులో రానుంది. ఈ రైలు సోమవారాల్లో సాయంత్రం 4.30 గంటలకు కొల్లాం నుండి బయలుదేరుతుంది. బుధవారం అర్థ‌రాత్రి 2.30 గంట‌ల‌కు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు ఇవే….

ఈ రెండు ప్రత్యేక రైళ్లు శ్రీకాకుళం-కొల్లాం మ‌ధ్య‌ పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, ఈరోడ్‌, జోలార్‌పేట, పోదనూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, ఎట్టుమనూర్, కొట్టాయం, చెంగనస్సేరి, తిరువాల, చెంగన్నూర్, మావేలికర, కాయంకులం రైల్వే స్టేష‌న్‌లో ఆగుతాయి.

ఈ రైళ్లలో నాలుగు సెకండ్ క్లాస్, ఎనిమిది స్లీపర్ క్లాస్, ఆరు థర్డ్ ఏసీ ఎకానమీ, ఒక సెకండ్ ఏసీ కోచ్‌, ఒక సెకండ్ క్లాస్ సిట్టింగ్ కమ్ లగేజీ/ దివ్యాంగజన్, ఒక లగేజీ/జనరేటర్/బ్రేక్ వాన్ కోచ్‌లు ఉంటాయి.

విశాఖపట్నం-కొల్లాం స్పెష‌ల్ రైళ్లు పొడిగింపు:

1. విశాఖ‌ప‌ట్నంలో బ‌య‌లుదేరే విశాఖపట్నం-కొల్లాం వీక్లీ స్పెష‌ల్‌ ఎక్స్‌ప్రెస్ (08539) రైలును 2024 డిసెంబర్ 4 నుండి 2025 ఫిబ్రవరి 26 వరకు పొడిగించారు. ప్ర‌తి బుధవారం ఉద‌యం 8.20 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. ఈ రైలు గురువారం నాడు మ‌ధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

2. కొల్లాం-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08540) రైలు 2024 డిసెంబర్ 5 నుండి 2025 ఫిబ్రవరి 27 వరకు పొడిగించారు.ఈ రైలు ప్ర‌తి గురువారం కొల్లాం నుండి రాత్రి 7.35 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మ‌రుస‌టి రోజు శుక్రవారం నాడు రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు విశాఖ‌పట్నం-కొల్లాం మ‌ధ్య‌ దువ్వాడ, సామర్లకోట‌, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదునూరు, పాలక్కాడ్, త్రిచూర్, అలువూరు, త్రిచూర్‌లలో స్టాప్‌లు ఉంటాయి. టౌన్, కొట్టాయం, విశాఖపట్నం మరియు కొల్లం స్టేషన్‌ల మధ్య చెంగన్‌సేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెలికర, కాయంకుళం స్టేష‌న్ల‌లో ఆగుతాయి.

ఈ రెండు రైళ్లలో ఫస్ట్ ఏసీ-1, సెకెండ్ ఏసీ -2, థ‌ర్డ్‌ ఏసీ-4, థ‌ర్డ్ ఏసీ ఎకాన‌మీ-2, స్లీపర్-6, జనరల్ సెకండ్ క్లాస్-3, సెకండ్ క్లాస్ కమ్ లగేజీ, దివ్యాంగు కోచ్‌-1, జ‌న‌రేట‌ర్ మోట‌ర్ కార్-1 ఉన్నాయి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం