తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Divvela Madhuri : దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్, తానే కావాలని మరో కారుని ఢీకొట్టి!

Divvela Madhuri : దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్, తానే కావాలని మరో కారుని ఢీకొట్టి!

11 August 2024, 17:02 IST

google News
    • Divvela Madhuri : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 పలాసలో దివ్వెల మాధురి కారుకి ప్రమాదం, తీవ్రగాయాలు
పలాసలో దివ్వెల మాధురి కారుకి ప్రమాదం, తీవ్రగాయాలు

పలాసలో దివ్వెల మాధురి కారుకి ప్రమాదం, తీవ్రగాయాలు

Divvela Madhuri : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి కారు ఘోర ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దివ్వెల మాధురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

కారు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్

అయితే ఈ ప్రమాదంపై దివ్వెల మాధురి స్పందించారు. తనకు జరిగింది రోడ్డు ప్రమాదం కాదని తానే కావాలని మరో కారును ఢీకొట్టినట్లు ఆమె తెలిపారు. తనపై, తన పిల్లలపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్ తట్టుకోలేక, దువ్వాడ భార్య వాణి ఆరోపణలు భరించలేక ఇలా చేశానన్నారు. తనకు వైద్యం చేయొద్దని డాక్టర్లతో చెప్పానన్నారు. దీంతో దువ్వాడ వివాదం మరో మలుపుతిరిగింది. తనపై ట్రోల్ తట్టుకోలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని ఆమె పలు టీవీ డిబెట్లలో వాపోయారు.

"నాపైనా, నా పిల్లలపైనా లేనిపోని నిందలు వేస్తున్నారు. నేను చనిపోతే అందుకు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణియే కారణం. వాణి వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుందామని హైవే మీదకు వెళ్లాను" -దివ్వెల మాధురి

శ్రీ‌కాకుళం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ వివాదం కొనసాగుతోంది. దువ్వాడ శ్రీనివాస్... తన స్నేహితురాలు దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారు. దీంతో దువ్వాడ భార్య వాణి, కుమార్తె గురువారం రాత్రి ఆయన వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్, భార్య కుమార్తెల మధ్య వాగ్వాదం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నారని ఆయన భార్య వాణి ఆరోపిస్తు్న్నారు. గురువారం రాత్రి గొడవ నేపథ్యంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు సైతం పెట్టుకున్నారు. అసలు ఈ వ్యవహారంలో కీలంగా ఉన్న దివ్వెల మాధురి... వివాదంపై స్పందించారు.

శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. వాణి భ‌ర్త వ‌ద్దు, కేవలం ఎమ్మెల్యే టిక్కెట్టు చాలు అనుకున్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు మాధురి. ఇబ్బందుల‌తో సూసైడ్ చేసుకోవాల‌నుకున్న స‌మ‌యంలో దువ్వాడ శ్రీ‌నివాస్ త‌న‌కు అండ‌గా నిలిచార‌ని చెప్పారు. దువ్వాడ శ్రీ‌నివాస్ త‌న‌కు ఒక మంచి స్నేహితుడ‌ని, నిజాయితీపరుడని చెబుతూ త‌మ మ‌ధ్య సంబంధాన్ని వివ‌రించారు. త‌మది అక్రమ సంబంధం కాద‌ని, ఎవ‌రితో ఎవ‌రైనా క‌లిసి ఉండే హ‌క్కు ఉంద‌ని దివ్వెల మాధురి పేర్కొన్నారు. దువ్వాడ వాణి త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేయ‌కుండా, త‌న కుటుంబంలో ఏమైనా స‌మ‌స్యలుంటే ప‌రిష్కరించుకోవాల‌ని హితువు ప‌లికారు. వారి స‌మ‌స్యల్లోకి త‌న‌ను లాగొద్దని… త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయ‌కూడ‌ద‌న్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ను అతని భార్యాపిల్లలు ఇంటి నుంచి గెంటేశారని మాధురు చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్, తాను కలిసే ఉంటామన్నారు. త్వరలోనే ఇరువురు వేర్వేరుగా విడాకులకు దరఖాస్తు చేస్తామన్నారు. దువ్వాడ శ్రీనివాస్ తన బంధాన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు.

తదుపరి వ్యాసం