ATM Cash Van Robbery : మర్రి చెట్టు తొర్రలో రూ.66 లక్షలు, ఆరా తీసి అవాక్కైన పోలీసులు!
Published Apr 21, 2024 10:07 AM IST
- ATM Cash Van Robbery : ఒంగోలులో ఈ నెల 18న జరిగిన ఏటీఎం క్యాష్ వ్యాన్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కంపెనీ ఉద్యోగులే చోరీకి ప్లాన్ చేసి దొరికిపోగా.. దొంగలించిన నగదును మర్రి చెట్టు తొర్రలో దాయడం చూసి పోలీసులు అవాక్కైయ్యారు.
మర్రి చెట్టు తొర్రలో రూ.66 లక్షలు
ATM Cash Van Robbery : మర్రి చెట్టు తొర్రలో(Banyan Tree cash) లక్షల నగదు బయటపడింది. సుమారు 66 లక్షల నగదు చెట్టు తొర్రలో దొరకడంతో పోలీసులు అవాక్కైయ్యారు. ఈ డబ్బు ఎక్కడిదో ఆరా తీస్తే ఏటీఎం చోరీ వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఏటీఎం నగదు నింపే వ్యాన్‌లో(Ongole ATM Cash Van Robbery) రూ.66 లక్షలు చోరీకి గురైంది. ఈ డబ్బును దొంగలు మర్రిచెట్టు తొర్రలో దాచారు. ఒంగోలులో(Ongole Crime) గురువారం ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ నుంచి రూ.66 లక్షలు దోచుకెళ్లిన దొంగలను ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
అసలేం జరిగింది?
ఈ నెల 18న ఒంగోలు(Ongole) పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం దగ్గర చోరీ జరిగింది. ఒంగోలు-కర్నూలు రోడ్డులోని ఓ పెట్రోల్ బంకు ఆవరణలో ఏటీఎంలలో(ATM Cash Van) నగదు నింపే సీఎంఎస్ ఏజెన్సీకి చెందిన వ్యాను వచ్చింది. ఈ వ్యానులో రూ.68 లక్షల నగదు ఉంది. మధ్యాహ్నం సమయం కావడంతో నగదు ఉన్న వ్యాను పెట్రోల్ బంక్ ఆవరణలో నిలిపి ఏటియం సెంటర్ వెనుక వైపు భోజనం చేసేందుకు వెళ్లారు. సిబ్బంది తిరిగి వచ్చే సరికే వ్యానులో నగదు మాయం అయింది. సినీ ఫక్కీ జరిగిన ఈ చోరీ ఘటనపై సీఎంఎస్ ఏజెన్సీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ వాహనం నుంచి సుమారు రూ. 66 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్టు సీఎంఎస్ సంస్థ లోకల్ మేనేజర్ కొండారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాన్ డోర్ మధ్యలో ఉన్న హోల్‌లో నుంచి చెయ్యి పెట్టి లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లిన దుండగులు... అక్కడే ఉన్న బ్యాగులో రూ.66 లక్షలు సర్దుకుని పరారయ్యాడు. రెండు లక్షలను అక్కడే వదిలేశాడు. లంచ్ చేసి వచ్చిన సిబ్బంది వ్యాను డోర్ తీసి ఉండడంతో వెంటనే నగదు కోసం చూశారు. క్యాష్ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చోరీ సొత్తు మర్రి తొర్రలో
పోలీసుల దర్యాప్తులో సీఎంఎస్(CMS Employees) ఉద్యోగులే నిందితులని తేలిపింది. దొంగిలించిన డబ్బు(Chori) మొత్తాన్ని నిందితులు ఓ మర్రి చెట్టు తొర్రలో దాచి పెట్టడం ఇక్కడ విశేషం. ఒంగోలు సీఎంఎస్ బ్రాంచ్ మేనేజర్ కొండారెడ్డి, సీఎంఎస్ మాజీ ఉద్యోగి మహేష్‌బాబ, రాచర్ల రాజశేఖర్ చోరీ చేసినట్లు గుర్తించారు. టెక్నికల్ ఆధారాలతో ముందు మహేష్ బాబును పట్టుకున్నామన్నారు. అతడిని విచారించగా... అసలు విషయం తెలిసిందన్నారు. చోరీ చేసిన నగదును మర్రి చెట్టు తొర్రలో దాచారని, డబ్బు రికవరీ ప్రకాశం ఎస్పీ(Prakasam SP) గరుడ్ సుమిత్ అనీల్ తెలిపారు. లింగారెడ్డి కాలనీలోని సీఎంఎస్ కార్యాలయం వద్ద రాజశేఖర్, కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పనిచేస్తున్న కంపెనీకే కన్నం వేయాలని ప్రయత్నించి నిందితులు దొరికిపోయారు.