AP EAP CET2024 Results: నేడు ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేయనున్న జేఎన్‌టియూ, ఉన్నత విద్యా మండలి
11 June 2024, 6:17 IST
- AP EAP CET2024 Results: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మే 23తో ప్రవేశ పరీక్ష ముగిసినా ఫలితాల విడుదలలో మాత్రం జాప్యం జరిగింది. ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో ఫలితాల విడుదలకు అడ్డంకులు తొలిగాయి.
నేడు ఏపీ ఈఏపీ సెట్ 2024 ఫలితాలు విడుదల
AP EAP CET2024 Results: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ 2024 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి మంగళవారం సాయంత్రం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
మే 16 నుంచి 23వ తేదీ వరకు ఏపీతో పాటు తెలంగాణలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్షను నిర్వహించారు. మే నెలాఖరులోగా ఫలితాలు వెలువడుతాయని భావించినా ఎన్నికల ఫలితాలు వెలువడటం, వైసీపీ ఓటమి పాలవడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి పదవికి రాజీనామా చేయడంతో ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది.
మరోవైపు రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్శిటీలు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేశాయి. త్వరలో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాయి. పొరుగున ఉన్న తెలంగాణలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదలై కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఖరారైంది.
ఏపీలో ఫలితాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల కాకపోవడంపై విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పలితాలు విడుదల కాకపోవచ్చని ప్రచారం జరిగింది. అనూహ్యంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందే ఈఏపీ సెట్ ఫలితాల విడుదలకు అమోదం లభించింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు.
ఏపీ ఈఏపీ సెట్ చైర్మన్, జేఎన్ టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు విజయవాడలో ఫలితాలను విడుదల చేస్తారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యా మండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ రామ్మోహన్ రావుతో కలిసి కలిసి ఫలితాలను విడుదల చేస్తారు.
ఈ ఏడాది ఈఏపీ సెట్‌ను కాకినాడ జేఎన్‌టియూ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 3,62,851 మంది ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల కోసం దరఖాస్తు చేశారు. వారిలో 3,39,139 మంది మూడు స్ట్రీమ్‌లలో పరీక్షలకు హాజరయ్యారు. రోజుకు రెండు సెషన్లో ఈ పరీక్షల్ని నిర్వహించారు.
ఇంజినీరింగ్ విభాగంలో 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభా గాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు. ఈ ఏపీ సెట్ ఫలితా లను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx లో అందుబాటులో ఉంచుతారు. ఏపీ ఈఏపీ సె ట్ లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఇస్తారు. ఈ మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. ఫలితాలతో పాటు కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను కూడా నేడు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. s