తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Goa Tour: స‌త్తెన‌ప‌ల్లి నుంచి గోవాకు ఆర్టీసీ స్పెష‌ల్ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్

Goa Tour: స‌త్తెన‌ప‌ల్లి నుంచి గోవాకు ఆర్టీసీ స్పెష‌ల్ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్

HT Telugu Desk HT Telugu

24 June 2024, 21:16 IST

google News
    • గోవా టూర్ వెళ్లేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) బ‌స్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
స‌త్తెన‌ప‌ల్లి నుంచి గోవాకు ఆర్టీసీ స్పెష‌ల్ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్
స‌త్తెన‌ప‌ల్లి నుంచి గోవాకు ఆర్టీసీ స్పెష‌ల్ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్

స‌త్తెన‌ప‌ల్లి నుంచి గోవాకు ఆర్టీసీ స్పెష‌ల్ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నుంచి గోవాకి ఆర్టీసీ స్పెష‌ల్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్‌ను నడుపుతోంది. టూరిజం డిపార్ట్‌మెంట్ త‌ర‌హాలోనే ప‌ర్య‌ట‌కుల కోసం ఆర్టీసీ ప్ర‌త్యేక స‌ర్వీస్‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స‌ర్వీస్‌ల‌ను టూరిస్టులు, ప్ర‌యాణికులు ఉప‌యోగించుకోవాల‌ని ఆర్టీసీ కోరుతోంది.

కొత్త మార్గాలు, ఆధ్యాత్మిక ప‌ర్య‌టక కేంద్రాల‌కు నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ ఇప్పుడు టూరిస్టు ప్రాంతాల‌కు కూడా ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను తీసుకొచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీ గ‌త కొంత కాలంగా ఈ ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెస్తోంది. సీజ‌న్ ప్రకారం ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలకు, టూరిస్టు ప్రాంతాల‌కు ఆర్టీసీ స‌ర్వీస్‌ల‌ను నడిపిస్తోంది.

డిమాండ్‌ను బ‌ట్టీ ఒక‌టి, రెండు, మూడు స‌ర్వీసుల‌ను తీసుకొస్తుంది. అలాగే ఏసీ, సూప‌ర్ ల‌గ్జరీ, ఎక్స్‌ప్రెస్‌, ఆర్డిన‌రీ స‌ర్వీస్‌ల‌ను నడుపుతోంది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులోని అరుణాచ‌లం పుణ్య‌క్షేత్రానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏసీ, సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా గోవా ప‌ర్య‌ట‌కానికి సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల‌ను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈనెల 25 (మంగ‌ళ‌వారం)న స‌త్తెన‌ప‌ల్లి నుంచి గోవాకు ప్ర‌త్యేక బ‌స్ స‌ర్వీస్ అందుబాటులో ఉంది. మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు స‌త్తెన‌ప‌ల్లి నుంచి గోవాకు బ‌స్ బ‌య‌లుదేరుతుంది. తిరిగి ఈనెల 29న గోవా నుంచి బ‌య‌లుదేరి జూలై 2న స‌త్తెన‌ప‌ల్లికి చేరుకుంటుంది. స‌త్తెన‌ప‌ల్లి నుంచి గోవాకు వెళ్లిన‌ప్పుడు వివిధ ప్ర‌దేశాలను సంద‌ర్శించి వచ్చే వీలుంది.

రెండు వైపుల టిక్కెట్టు ధ‌ర రూ. 7,500గా ఆర్టీసీ నిర్ణ‌యించింది. టిక్కెట్టును ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలి. అలాగే ఇంకా వివ‌రాల కోసం స‌త్తెన‌ప‌ల్లి ఆర్టీసీ డిపోలో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని డిపో మేనేజ‌ర్ కుమార్ తెలిపారు. ఈ అవ‌కాశాన్ని టూరిస్టులు, ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని డిపో మేనేజ‌ర్ కుమార్ కోరారు.

- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

టాపిక్

తదుపరి వ్యాసం