IRCTC Karnataka Goa Tours : 6 రోజుల్లో కర్ణాటక, గోవా చూసొద్దామా?- గోల్డెన్ చారియట్ టూర్ ప్యాకేజీ ఇదే!
IRCTC Karnataka Goa Tours : కర్ణాటక, గోవా పర్యాటక ప్రదేశాల్లో 6 రోజులు చక్కర్లు కొట్టేందుకు గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలులో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
1వ రోజు : శనివారం (బెంగళూరు నుంచి నంజన్‌గూడు)
యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఉదయం 08:30 గంటల నుంచి రిజిస్ట్రేషన్, చెక్ ఇన్ ప్రారంభం అవుతుంది. యశ్వంత్ పూర్ నుంచి ఉదయం 9.45 గంటలకు రైలు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు రైలు నంజన్‌గూడు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2:45 గంటలకు (1 గంట 30 నిమిషాల డ్రైవ్) బందీపూర్ నేషనల్ పార్క్ డ్రైవ్ కు వెళ్తారు. సాయంత్రం సఫారీ (4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు) ఉంటుంది. రాత్రి 8:15 గంటలకు రైల్వే స్టేషన్ కు తిరిగి వస్తారు. రైలు మైసూర్‌కు వెళ్లే సమయంలో ఆన్‌బోర్డ్ లోనే డిన్నర్ చేస్తారు. రాత్రికి మైసూరుకు చేరుకుని రైలులోనే బస చేస్తారు.
2వ రోజు : ఆదివారం (మైసూరు)
ఉదయం రైలులోనే అల్పాహారం చేస్తారు. అనంతరం మైసూరు ప్యాలెస్ చూడడానికి వెళ్తారు. శ్రీరంగపట్నం(Optional) సందర్శన తర్వాత భోజనం కోసం రైలు వద్దకు తిరిగి వెళ్తారు. రైలు రాత్రి 8.00 గంటలకు బనావర్ లో ఇంధనం కోసం ఆగుతుంది.
3వ రోజు : సోమవారం (హళేబీడు, చికమగళూరు)
ఉదయం బాణావర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుంచి హళేబీడు సందర్శనకు వెళ్తారు. రైలు చికమగళూరుకు వెళుతుండగా ఆన్‌బోర్డ్‌లో లంచ్ ఉంది. సాయంత్రం కాఫీ ప్లాంటేషన్ సందర్శన తర్వాత చికమగళూరులో సాంస్కృతిక కార్యక్రమాలు, విందు ఉంటాయి. ఆ తర్వాత రైలులో హోస్పేట్‌కు బయలుదేరుతుంది.
4వ రోజు : మంగళవారం (హోస్పేట్)
రైలు హోస్పేట్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి హంపి క్షేత్రానికి వెళ్లారు. హంపి సందర్శన అనంతరం తిరిగి స్టేషన్ కు చేరుకుంటారు. సాయంత్రం రైలు గోవాకు బయలుదేరుతుంది.
5వ రోజు: బుధవారం (గోవా)
ఉదయం కర్మాలి చేరుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత నార్త్ గోవా చర్చిలను సందర్శిస్తారు. ఉదయం 09:00 గంటలకు రైలు దిగి స్థానిక ప్రదేశాల సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం 12:00 గంటలకు తిరిగి స్టేషన్ కు వస్తారు. రైలు మడ్‌గావ్‌కు బయలుదేరుతుంది. సౌత్ గోవాలోని ఒక హోటల్‌లో సాయంత్రం గాలా డిన్నర్ యాక్టివిటీ ఉంటుంది. అనంతరం రాత్రి 11.30 గంటలకు రైలు బెంగుళూరుకు తిరిగి ప్రయాణం అవుతుంది.
6వ రోజు : గురువారం (బెంగళూరు)
గోల్డెన్ చారియట్ రైలు బెంగళూరుకు చేరుకుంటుంది. దీంతో పర్యటన ముగుస్తుంది.
దక్షిణ భారతంలో
గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలు - భారతదేశంలోని ప్రముఖ పర్యటక ప్రదేశాల సందర్శనకు ఐఆర్సీటీసీ ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఆయా ప్రాంతాల సంస్కృతి, చరిత్ర, కట్టడాలను సందర్శించడానికి గోల్డెన్ చారియట్ టూరిస్ట్ ప్యాకేజీ అందిస్తుంది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను ఈ ట్రైన్ మార్గంలో సందర్శించవచ్చు.
ప్రత్యేక క్యాబిన్లు, రెస్టారెంట్లు, బార్, స్పా సదుపాయం
గోల్డెన్ చారియట్ రైలు గెస్ట్ క్యారేజీలకు అనేక శతాబ్దాలుగా దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాల పేరు పెట్టారు. ప్రతి అతిథి క్యారేజీలో ట్విన్స్, డబుల్స్ మిక్స్‌తో నాలుగు క్యాబిన్‌లు ఉంటాయి. 13 డబుల్ క్యాబిన్‌లు, 30 ట్విన్ బెడ్ క్యాబిన్‌లు, 1 క్యాబిన్ ప్రత్యేక సామర్థ్యం ఉన్నవారికి అందుబాటులో ఉన్నాయి. రుచి, నలపాక రెండు రెస్టారెంట్లు రుచికరమైన భోజనాన్ని అందిస్తాయి. మదిర బార్ వైన్లు, బీర్లు, స్పిరిట్ అందిస్తుంది. ఆరోగ్య ది స్పా కమ్ ఫిట్‌నెస్ సెంటర్ ఆయుర్వేద స్పా థెరపీలను ఆధునిక వ్యాయామ యంత్రాలతో మిళితం చేసి అందిస్తుంది.
టికెట్ల బుక్కింగ్, పూర్తి వివరాలకు www.goldenchariot.org వెబ్ సైట్ ను సందర్శించండి.
సంబంధిత కథనం