EC CEO on Attack Issue: జగన్‌పై దాడి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఈసీ ఆదేశం
15 April 2024, 18:33 IST
- EC CEO on Attack Issue: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఎన్నికల సంఘం ప్రధానాధికారి మీనా ఆదేశించారు.
ఎన్నికల సంఘం సీఈఓకు దాడి ఘటన వివరిస్తున్న సీపీ కాంతిరాణా
EC CEO on Attack Issue: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై Ys Jagan దాడి Attack వ్యవహారంలో దర్యాప్తను వేగవంతం చేయాలని ఈసీ సీఈఓ మీనా ఆదేశించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ CP కాంతి రాణాను, ఐ.జి. రవిప్రకాష్‌ల నుంచి సచివాలయంలో దర్యాప్తు వివరాలు తెలుసుకున్న సీఈఓ మీనా, దర్యాప్తు వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ సమీపంలో శనివారం రాయితో దాడి చేసిన ఘనకు సంబందించిన కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి EC CEO ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నగర సి.పి. కాంతి రాణా టాటాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించారు.
సోమవారం రాష్ట్ర సచివాలయంలోని పోలీస్ అధికారులతో సమావేశమైన సీఈఓ… సిఎంపై దాడి ఘటనకు సంబందించిన పూర్వా పరాలపై సమీక్షించారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న “మేమంతా సిద్దం” బస్సు యాత్రలో దాడి ఏ విధంగా చోటు చేసుకుంది, దాడి చేసేందుకు నిందితులకు ఏ విధంగా అవకాశం ఏర్పడింది, పూర్తి స్థాయిలో బందోబస్తు ఉన్నప్పటికీ నిందితులు ఏ విధంగా రాయితో దాడిచేయగలిగారు అనే విషయాలపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ ఘనటకు సంబందించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితుల విచారణ ఏ విధంగా సాగుతున్నదో అడిగి తెలుసుకున్నారు. ఆ విచారణలో బయటపడిన విషయాలపై సీఈఓ ఆరా తీశారు. ఈ కేసుకు సంబందించిన దర్యాప్తును మరింత వేగవంతం చేసి సమగ్ర నివేదికను సాద్యమైనంత త్వరగా అందజేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖ వ్యక్తుల పర్యటనల్లో ఇటు వంటి దుర్ఝటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో విఐపిల ప్రచార భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశంపై ఆరాతీశారు.
జగన్‌పై దాడికి సంబంధించి దృశ్యాలు, ప్రస్తుతం జరుగుచున్న దర్యాప్తు ప్రగతిని వీడియోలు, ఫొటోల ద్వారా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు.