తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : భక్తులకు అలర్ట్... తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం - ఇలా పొందవచ్చు

Tirumala : భక్తులకు అలర్ట్... తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం - ఇలా పొందవచ్చు

03 March 2024, 9:03 IST

    • Tirumala Srivari Temple Updates : శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం.భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను మార్చి 15 నుంచి ఈ – వేలం వేయనున్నట్లు ప్రకటించింది.
తిరుమల తిరుపతి
తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

Tirumala Tirupati Devasthanams Updates: తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ- వేలానికి సంబంధించి ప్రకటన జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను మార్చి 15 నుంచి వేలం వేస్తున్నట్లు తెలిపింది. మార్చి 22వ‌ తేదీ వరకు ఈ – వేలం ఉంటుందని పేర్కొంది. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 412 లాట్లు ఉన్నాయని వివరించింది.

ట్రెండింగ్ వార్తలు

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

ఇందులో ఆర్ట్ సిల్క్ ధోతీలు, ఉత్తరీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, లుంగీలు, దుప‌ట్టాలు, శాలువ‌లు, బెడ్ షీట్లు, నాప్ కిన్స్‌, హ్యాండ్ క‌ర్చీఫ్‌లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళాలు, కార్పెట్లు, గొడుగులు ఉన్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించవచ్చని సూచించింది.

వాచీలు, మొబైల్ ఫోన్ల ఈ-వేలం

Tirumala Srivari Watches and Mobiles Auction: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ు, మొబైల్ ఫోన్లను వేలం వేయనుంది టీటీడీ. మార్చి 13న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి.

కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 23 లాట్లు, మొబైల్ ఫోన్లు 27 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో సంప్రదించవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించవచ్చని సూచించింది.

విశేష పర్వదినాలివే..

Special Festivals at Tirumala 2024: ఈ మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను(Special Festivals at Tirumala 2024) ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి వేడక జరగనున్నట్లు పేర్కొంది. మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు ఉంటాయని వెల్లడించింది.⁠ ⁠మార్చి 25న తుంబురు తీర్థ ముక్కోటి, శ్రీ ల‌క్ష్మీ జ‌యంతి నిర్వహించనున్నట్లు తెలిపింది.

మార్చిలో జరిగే విశేష ఉత్సవాలు :

•⁠ ⁠మార్చి 3న ప‌ల్స్ పోలియో.

•⁠ ⁠మార్చి 6, 20న స‌ర్వ ఏకాద‌శి.

•⁠ ⁠మార్చి 8న మ‌హాశివ‌రాత్రి.

•⁠ ⁠మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు.

•⁠ ⁠మార్చి 25న తుంబురు తీర్థ ముక్కోటి, శ్రీ ల‌క్ష్మీ జ‌యంతి.

యువకులైన శ్రీవారి సేవకులు క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. టీటీడీ చేపట్టిన అనేక కార్యక్రమాలతో పాటు ధార్మిక మరియు ఎస్వీబిసి కార్యక్రమాలు బాగున్నాయ‌ని భ‌క్తులు ప్రశంసల వర్షం కురిపించారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం శ‌నివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

తదుపరి వ్యాసం