తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Budget Allocations For Ap: బడ్జెట్ కేటాాయింపుల్లో ఏపీకి దక్కిందేంటి?

Budget allocations for AP: బడ్జెట్ కేటాాయింపుల్లో ఏపీకి దక్కిందేంటి?

HT Telugu Desk HT Telugu

01 February 2023, 13:30 IST

    • Budget allocations for AP: బడ్జెట్ కేటాాయింపుల్లో ఏపీకి దక్కిందెంత? నిర్మలా సీతారామన్ ఆంధ్ర ప్రదేశ్‌కు చేసిన కేటాయింపులు ఇవే
బడ్జెట్ ప్రసంగం చేస్తున్న నిర్మలా సీతారామన్
బడ్జెట్ ప్రసంగం చేస్తున్న నిర్మలా సీతారామన్ (PTI)

బడ్జెట్ ప్రసంగం చేస్తున్న నిర్మలా సీతారామన్

Budget allocations for AP: తాజా బడ్జెట్ 2023-24లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్ర ప్రదేశ్‌కు మొండి చేయే చూపారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలకు కూడా మోక్షం లభించలేదు. ఆ చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం ఓడరేవు, కాకినాడ పెట్రోకాంప్లెక్స్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకూ మోక్షం లేకుండా పోయింది.

బడ్జెట్ కేటాాయింపుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్ర ప్రదేశ్‌కు చేసిన కేటాయింపులు ఇవే..

సెంట్రల్ యూనివర్శిటీ-ఏపీ : రూ. 50 కోట్లు

ట్రైబల్ యూనివర్శిటీ - ఏపీ: రూ. 20 కోట్లు

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ : రూ. 170 కోట్లు

ప్రధాన మంత్రి స్వాస్థ్య బీమా యోజన: రూ. 3365 కోట్లు (అన్ని ఎయిమ్స్ సంస్థలకు కలిపి)

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్: రూ. 120 కోట్లు (దేశవ్యాప్తంగా ఏర్పాటైన కొత్త డిజైన్ ఇనిస్టూట్లకు కలిపి)

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సిన పన్ను వాటా ఇలా..

కార్పొరేషన్ టాక్స్ : రూ. 13,230కోట్లు

కస్టమ్స్ : రూ. 1311,32 కోట్లు

ఇన్‌కమ్ టాక్స్: రూ. 12,871 కోట్లు

సెంట్రల్ జీఎస్టీ: రూ. 13,366 కోట్లు

ఎక్సైజ్ డ్యూటీ: రూ. 549 కోట్లు

టాపిక్