తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : ఆ ఒక్కరోజు ఘాట్ రోడ్లలో బైక్‌లకు అనుమతి లేదు - టీటీడీ ప్రకటన

Tirumala : ఆ ఒక్కరోజు ఘాట్ రోడ్లలో బైక్‌లకు అనుమతి లేదు - టీటీడీ ప్రకటన

05 September 2024, 21:09 IST

google News
    • శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 8న నిర్వహించబోయే గరుడ సేవ రోజు పలు ఆంక్షలను విధించింది. ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది.
టీడీపీ కీలక నిర్ణయం
టీడీపీ కీలక నిర్ణయం

టీడీపీ కీలక నిర్ణయం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా  గరుడ సేవ రోజుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

రాకపోకలు నిషేధం…!

గరుడసేవ రోజున భారీగా విచ్చేసే భక్తుల భద్రతను దృష్ట్యా… అక్టోబరు 8న రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 

అక్టోబరు 4 నుండి 12 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 8న ముఖ్యమైన గరుడ సేవ నిర్వహించనున్నారు. కాబట్టి అక్టోబర్ 7న రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించబడవని స్పష్టం చేసింది.  భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.

అక్టోబరు 4న ధ్వజారోహణం…

బ్రహ్మోత్సవాల షెడ్యూల్ చూస్తే…. అక్టోబరు 4న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు ఉంటాయి. అక్టోబరు 8వ తేదీన గరుడ సేవ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఇక అక్టోబరు 9వ తేదీన స్వర్ణరథం, 11వ తేదీన రథోత్సవం ఉంటాయి. ఇక 12వ తేదీన చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల వేళ పలు రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది.

సీల్డ్ టెండ‌ర్ల‌ ఆహ్వానం - టీటీడీ ప్రకటన

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్‌లు సీల్డ్ టెండ‌ర్ల‌కు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

టెండ‌ర్ పొందిన వారు టీటీడీ వినియోగించిన ఖాళి టిన్‌లు సేక‌రించ‌వ‌చ్చు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండ‌ర్లు సెప్టెంబరు 6వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లలోపు అంద‌జేయ‌ాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 సంప్రదించవచ్చు.

 

తదుపరి వ్యాసం