తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Special Buses : రాజ‌మండ్రి నుంచి పంచారామాలు, శబరిమల‌కు స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీసులు-ప్యాకేజీలు ఇవే

APSRTC Special Buses : రాజ‌మండ్రి నుంచి పంచారామాలు, శబరిమల‌కు స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీసులు-ప్యాకేజీలు ఇవే

HT Telugu Desk HT Telugu

27 October 2024, 18:27 IST

google News
  • APSRTC Special Buses : కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ రాజమండ్రి నంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రసిద్ధ శైవ‌క్షేత్రాలైన పంచారామాల‌కు ప్రత్యేక స‌ర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుకొచ్చింది. శ‌బ‌రిమ‌ల‌కు కూడా ప్రత్యేక స‌ర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది.

రాజ‌మండ్రి నుంచి పంచారామాలు, శబరిమల‌కు స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీసులు-ప్యాకేజీలు ఇవే
రాజ‌మండ్రి నుంచి పంచారామాలు, శబరిమల‌కు స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీసులు-ప్యాకేజీలు ఇవే

రాజ‌మండ్రి నుంచి పంచారామాలు, శబరిమల‌కు స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీసులు-ప్యాకేజీలు ఇవే

భ‌క్తుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రాజమండ్రి నుంచి ప్రత్యేక బస్సులు న‌డిపేందుకు ఆర్టీసీ రాజ‌మండ్రి డిపో నిర్ణయించింది. ప్రసిద్ధ శైవ‌క్షేత్రాలైన పంచారామాల‌కు ప్రత్యేక స‌ర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుకొచ్చారు. అలాగే శ‌బ‌రిమ‌ల‌కు కూడా ప్రత్యేక స‌ర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. భ‌క్తుల‌ కోసం సూప‌ర్ ల‌గ్జరీ, అల్ట్రా డీల‌క్స్‌, ఎక్స్‌ప్రెస్ బ‌స్సులు న‌డుపుతున్నారు.

పంచారామాల ద‌ర్శన ప్రాంతాలు...ప్యాకేజీలు

ఈ బస్సులు కార్తీకమాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు రాజమండ్రి నుంచి బయలుదేరి పంచారామాలైన అమ‌రావ‌తి (అమ‌రేశ్వరుడు), భీమ‌వ‌రం (సోమేశ్వరుడు), పాల‌కొల్లు (క్షీర‌రామ‌లింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామ‌ర్లకోట (కొమ‌ర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాల‌ను కార్తిక సోమ‌వారం నాడు ద‌ర్శనం పూర్తి చేసుకుంటారు. సోమ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు రాజ‌మండ్రి కాంప్లెక్స్‌కు చేరుకుంటారు. ఈ ప్రత్యేక స‌ర్వీసులు న‌వంబ‌ర్ నెల‌లో ప్రతి ఆదివారం న‌వంబ‌ర్ 3, 10,17, 24 తేదీల‌తో పాటు డిసెంబ‌ర్ 1న అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రతీ శ‌నివారం రాత్రి 7 గంట‌ల‌కు బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి. పంచారామాల ద‌ర్శనం చేసుకుని ఆదివారం రాత్రి 8 గంట‌ల‌కు రాజ‌మండ్రి బ‌స్ కాంప్లెక్స్‌కు చేరుకుంటారు. ఈ ప్రత్యేక స‌ర్వీసులు న‌వంబ‌ర్ నెల‌లో ప్రతి శ‌నివారం న‌వంబ‌ర్ 2, 9, 16, 23 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.

టిక్కెట్టు ధ‌ర సూప‌ర్ ల‌గ్జరీ, అల్ట్రా డీల‌క్స్‌, ఎక్స్‌ప్రెస్ బ‌స్సులకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరికి టిక్కెట్టు ధ‌ర‌ ఎక్స్‌ప్రెస్ స‌ర్వీసుకు రూ.850, అల్ట్రా డీల‌క్స్ స‌ర్వీసుకు రూ.1,040, సూప‌ర్ ల‌గ్జరీ స‌ర్వీసుకు రూ.1,090గా నిర్ణయించారు. రిజ‌ర్వేష‌న్ టికెట్లను రాజ‌మండ్రి బ‌స్టాండ్‌, గోక‌వ‌రం బ‌స్టాండ్, ఆన్‌లైన్‌లోనూ, టికెట్ల ఏజెంట్ల వ‌ద్ద ముందుగానే మీకు న‌చ్చిన సీటును రిజ‌ర్వేష‌న్ చేయించుకోవ‌చ్చని రాజ‌మండ్రి డిపో మేనేజర్ ఎస్‌కే షబ్నం తెలిపారు.

శ‌బ‌రిమ‌ల యాత్రలు, ప్యాకేజీ

అయ్యప్ప భ‌క్తుల కోసం శబరిమల‌కు సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చారు. శ‌బ‌రిమ‌ల యాత్రకు ఐదు రోజులు, ఏడు రోజులు, ప‌ది రోజుల యాత్ర ప్రాకేజీల‌ను డిపో మేనేజర్ ఎస్‌కే షబ్నం ప్ర‌క‌టించారు. సూప‌ర్ ల‌గ్జరీ యాత్ర బ‌స్సుల్లో ఆడియో, వీడియో, పుష్‌బ్యాక్ సౌకర్యం కూడా ఉంటుంది.

ఐదు రోజుల యాత్ర

శ‌బ‌రిమ‌ల, ఎరుమేలి, తిరుప‌తి, విజ‌య‌వాడ ద‌ర్శనం ఉంటుంది. ఒక్కొక్క‌రికి టిక్కెట్టు ధ‌ర రూ.5,000 ఉంటుంది.

ఏడు రోజుల యాత్ర

విజ‌య‌వాడ‌, కాణిపాకం, అరుణాచ‌లం, ప‌ళ‌ని, ఎరుమేలి, పంబ‌, త్రివేండ్రం, క‌న్యాకుమారి, మ‌ధురై, తిరుప‌తి ద‌ర్శ‌నం ఉంటుంది. ఒక్కొక్క‌రికి టిక్కెట్టు ధ‌ర రూ.6,000 ఉంటుంది.

ప‌ది రోజుల యాత్ర

విజ‌య‌వాడ‌, శ్రీశైలం, మ‌హానంది, కాణిపాకం, అరుణాచ‌లం, ప‌ళ‌ని, ఎరుమేలి, పంబ‌, త్రివేండ్రం, క‌న్యాకుమారి, తిరుచందూర్‌, రామేశ్వరం, మ‌ధురై, తిరుప‌తి, శ్రీకాళ‌హ‌స్తి ద‌ర్శనం ఉంటుంది. ఒక్కొక్కరికి టిక్కెట్టు ధ‌ర రూ.7,500 ఉంటుంది.

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9959225535, 7382912141, ఎంక్వయిరీ: 08832468625, రిజర్వేషన్: 9959225561, 9502300189ల‌కు ఫోన్ చేసి పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. వీటికి సంబంధించిన కరపత్రములు, గోడపత్రికలు, బ్యానర్స్ ను తూర్పుగోదావరి జిల్లా డీపీటీవో కె. షర్మిల అశోక విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి డిపో మేనేజర్ ఎస్‌కే షబ్నం, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్), స్టేషన్ మేనేజర్, ఎల్‌వో, జనరల్ ఏడీఎస్‌, ఓపీఆర్ఎస్‌ ఇంచార్జ్ పాల్గొన్నారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం