APSRTC Apprenticeship 2024 : ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం, ఆఖరు తేదీ అక్టోబర్ 31
23 October 2024, 16:20 IST
APSRTC Apprenticeship 2024 : ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటీస్ షిప్ నకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం, ఆఖరు తేదీ అక్టోబర్ 31
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)లో అప్రెంటీస్‌షిప్‌నకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో వివిధ ట్రేడ్‌లకు సంబంధించి అప్రెంటీస్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అక్టోబర్ 31 లోగా దరఖాస్తులు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏ జిల్లాల్లో ఏ ట్రేడ్‌లో ఖాళీ?
ఆయా జిల్లాల్లో వివిధ ట్రేడ్‌ల్లో ఖాళీలను బట్టీ అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
1. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, పెయింటర్ ట్రేడుల్లో అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
2. అనకాపల్లి జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ట్రేడుల్లో అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
3. విజయనగరం జిల్లాకు సంబంధించి మెషినిస్ట్ ట్రేడ్‌కు సంబంధించి అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
4. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్ ట్రేడ్‌కు అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
5. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్ ట్రేడ్‌కు అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
6. కాకినాడ జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడుల్లో అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
7. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ట్రేడుల్లో అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
8. బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడుల్లో అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అర్హతలు
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఆయా ట్రేడుల్లో ఐటీఐని గుర్తింపు పొందిన సంస్థ నుంచి పూర్తి చేసి ఉండాలి.
ఎలా అప్లై చేసుకోవాలి?
ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్‌షిప్ కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ https://www.apprenticeshipindia.gov.in/ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ధృవీకరణ పత్రాల పరిశీలన
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అభ్యర్థులకు నవంబర్ 6న, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నవంబర్ 7న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల అభ్యర్థులకు నవంబర్ 8న సర్టిఫికేట్లు పరిశీలన చేస్తారు.
అభ్యర్థులు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటలకు విజయనగరంలోని వీటీ అగ్రహారంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనిగ్ కాలేజీలో హాజరుకావాలి. ఒక జిల్లాలో సంబంధిత ట్రేడ్‌లో ఖాళీలు లేనిచో వేరే జిల్లాలో పని చేసేందుకు అంగీకార పత్రం సర్టిఫికేట్ల పరిశీలన సమయంలో రాసి ఇవ్వాలి. మరిన్ని వివరాలకు 08922-294906 ఫోన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు