APPSC Group 1 Mains : 'వెబ్ సైట్ లో ఆ వివరాలను నమోదు చేయండి'... గ్రూపు 1 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ నుంచి అలర్ట్
08 August 2024, 19:42 IST
- APPSC Group 1 Mains : గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్షలు రాసే మీడియంతో పాటు పరీక్షా కేంద్రాల ప్రాధాన్య వివరాలను నమోదు చేయాలని సూచించింది.
ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ 2024
APPSC Group 1 Mains : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. వెబ్ సైట్ లో పలు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. మెయిన్స్ పరీక్షలను ఏ మాధ్యమం(మీడియం)లో రాయాలనుకుంటున్నారనే అంశంపై ఆప్షన్ ఎంచుకోవాలి. అంతేకాకుండా పోస్టులు, జోనల్, పరీక్షా కేంద్రాల ప్రాధాన్య వివరాలను కూడా ఎంట్రీ చేయాలి. ఇందుకు ఆగస్టు 16వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ తెలిపారు ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఏప్రిల్ 12 విడుదల చేసిన సంగతి తెలిసిందే.మొత్తం 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ నోటిఫికేషన్ లో భాగంగా… మొత్తం 81 ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది ఏపీపీఎస్సీ. సెప్టెంబర్ మాసంలో మెయిన్స్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పోస్టుల భర్తీ కోసం మార్చి 17న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ప్రాథమిక కీని మార్చి 18న కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆన్‌లైన్ ద్వారా మూడు రోజుల పాటు మార్చి 19 నుంచి మార్చి 21 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించింది. ఆ తర్వాత ఫైనల్ కీతో పాటు ఫలితాలను ప్రకటించింది. https://psc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఏపీ గ్రూప్ 1 ఖాళీల వివరాలు
- డిప్యూటీ కలెక్టర్ పోస్టులు-9
- ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్-18
- డీఎస్పీ (సివిల్)- 26
- రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్-6
- డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు-5
- జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్- 4
- జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్- 3
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 2
- జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్- 1
- జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్-1
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II-1
- ఎక్సైజ్ సూపరింటెండెంట్- 1
ఇక ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా విధానం చూస్తే… రెండు క్వాలిఫైయింగ్ పేపర్లతో పాటు ఐదు మెరిట్-ర్యాంకింగ్ పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారే మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్ లో ఇంగ్లీష్ ఉంటుంది. ఇది 150 మార్కులకు నిర్వహిస్తారు. మరో పేపర్ తెలుగు ఉంటుంది. ఇది కూడా 150 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్లుగా పరిగణిస్తారు.
ఇక మెయిన్స్ లో చూస్తే పేపర్ 1 జనల్ ఎస్సేలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. భారత దేశ చరిత్రకు సంబంధించి రెండో పేపర్ ఉంటుంది.దీనికి 150 మార్కులు కేటాయించారు. భారత రాజ్యంగం, గవర్నెర్స్ అని మూడో పేపర్ ఉంటుంది. దీనికి 150 మార్కులు కేటాయించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నాల్గో పేపర్ ఉండగా.. దీనికి కూడా 150 మార్కులు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదో పేపర్ గా ఉండగా.. దీనికి కూడా 150 మార్కులు కేటాయించారు. ఇంగ్లీష్ , తెలుగు పేపర్లలో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మిగతా ఐదు పేపర్లలో నుంచి మెరిట్ ను తీసుకుంటారు.
టాపిక్