తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Group 1 Results : ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల - మెయిన్స్‌కు ఎంతమంది అర్హత సాధించారంటే..?

AP Group 1 Results : ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల - మెయిన్స్‌కు ఎంతమంది అర్హత సాధించారంటే..?

13 April 2024, 9:20 IST

    • APPSC Group 1 Prelims Results 2024 : గ్రూప్ -1 ప్రిలిమ్స్(APPSC Group 1 Prelims) ఫలితాలను ప్రకటించింది ఏపీపీఎస్సీ. శుక్రవారం రాత్రి వెబ్ సైట్ లోని జాబితాను అందుబాటులో ఉంచింది.  4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.
ఏపీ గ్రూప్ 1 ఫలితాలు
ఏపీ గ్రూప్ 1 ఫలితాలు

ఏపీ గ్రూప్ 1 ఫలితాలు

APPSC Group 1 Prelims Results: ఏపీ గ్రూప్ - 1 ప్రిలిమ్స్(APPSC Group 1 Prelims) ఫలితాలను వెల్లడించింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. శుక్రవారం రాత్రి తర్వాత ఫలితాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. గత నెల మార్చి 17వ తేదీన ఈ ఎగ్జామ్ జరగా….  4,496 మంది మెయిన్స్‌కు(AP Group 1 Mains) అర్హత సాధించారు. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ నోటిఫికేషన్ లో భాగంగా… మొత్తం 81 ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది ఏపీపీఎస్సీ. సెప్టెంబర్ మాసంలో మెయిన్స్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పోస్టుల భర్తీ కోసం మార్చి 17న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ప్రాథమిక కీ (Group 1 Key)మార్చి 18న కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచింది.  ఆన్‌లైన్ ద్వారా మూడు రోజుల పాటు మార్చి 19 నుంచి మార్చి 21 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించింది. ఆ తర్వాత ఫైనల్ కీతో పాటు ఫలితాలను ప్రకటించింది. https://psc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని కమిషన్ సూచించింది.

How To Check AP Group 1 Prelims Results : ఇలా చెక్ చేసుకోండి

  • ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://portal-psc.ap.gov.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే Result Notification for the post of Group-I Services అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
  • ఇక్కడ కనిపించే Provisionally qualified candidates list for mains examination అనే ఆప్షన్ పై క్లిక్ చేసే మీకు పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మెయిన్స్ కు అర్హత సాధించిన వారి హాల్ టికెట్ నెంబర్లు డిస్ ప్లే అవుతాయి.
  • Rejections list అనే మరో ఆప్షన్ ఉంది. దీనిపై క్లిక్ చేస్తే…. తిరస్కరణకు గురైన అభ్యర్థుల హాల్ టికెట్లు కనిపిస్తాయి.

ఏపీ గ్రూప్ 1 ఖాళీల వివరాలు

  • డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు-9
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌-18
  • డీఎస్పీ (సివిల్‌)- 26
  • రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌-6
  • డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు-5
  • జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌- 4
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్స్- 3
  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌- 2
  • జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌- 1
  • జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌-1
  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II-1
  • ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌- 1

APPSC Group 2 Prelims Results : మరోవైపు ఇటీవలనే ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను(APPSC Group 2 Prelims) ఏపీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్(Group 2 Mains) కు క్వాలి ఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default.aspx  లో ప్రకటించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)899 గ్రూప్-2 పోస్టులకు ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను(APPSC Group 2 Prelims) నిర్వహించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC)తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.

 

తదుపరి వ్యాసం