APCRDA Jobs : ఏపీ సీఆర్‌డీఏలో భారీ జీతంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తులకు నవంబర్ 13 ఆఖరు తేదీ
03 November 2024, 17:40 IST
APCRDA Jobs : ఏపీ సీఆర్డీఏలో భారీగా వేతనంతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. మొత్తం ఏడు రకాల విభాగాల్లో 19 పోస్టులు భర్తీ చేస్తుంది. నవంబర్ 13 దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేదీగా నిర్ణయించారు.
ఏపీ సీఆర్‌డీఏలో భారీ జీతంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తులకు నవంబర్ 13 ఆఖరు తేదీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్‌డీఏ)లో భారీగా జీతంతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఏడు రకాల విభాగాల్లో 19 పోస్టులు భర్తీ చేస్తుంది. జీతం రూ.50,000 నుంచి రూ.75,000 లభిస్తుంది. నవంబర్ 13 దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేదీగా నిర్ణయించారు.
ఏ పోస్టులు...ఎన్ని
- రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్-6
- ప్లానింగ్ అసిస్టెంట్ -2
- సీనియర్ లైవ్లీ హడ్ స్పెషలిస్టు-1
- జూనియర్ లైవ్లీ హడ్ స్పెషలిస్టు-3
- జెండర్ స్పెషలిస్ట్-1
- సీనియర్ ఆక్యుపేషనల్ స్పెషలిస్టు-2
- జూనియర్ ఆక్యుపేషనల్ స్పెషలిస్టు-4
విద్యార్హత
- రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్- బీటెక్, ఎంటెక్, ఎంఈ, బీఈ జీయో ఇన్ఫర్మేటిక్, రెండేళ్లు అనుభవం.
- ప్లానింగ్ అసిస్టెంట్ -బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ లేదా ఆర్కిటెక్చర్, రెండేళ్ల అనుభవం.
- సీనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్టు- మాస్టర్ డిగ్రీ సోషల్ వర్క్, రూరల్ డవలప్‌మెంట్, ఎకనామిక్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ, పదేళ్ల అనుభవం.
- జూనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్టు- మాస్టర్ డిగ్రీ సోషల్ వర్క్, రూరల్ డవలప్‌మెంట్, ఎకనామిక్స్, ఐదేళ్ల అనుభవం.
- జెండర్ స్పెషలిస్ట్- మాస్టర్ డిగ్రీ జండర్ స్టడీస్, సోషల్ వర్క్, సోషియాలజీ, పబ్లిక్ పాలసీ, పదేళ్ల అనుభవం.
- సీనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సెఫ్టీ స్పెషలిస్టు- మాస్టర్ డిగ్రీ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ, ఇన్విరాన్‌మెంట్ హెల్త్, ఇండస్ట్రీయల్ సేఫ్టీ, పదేళ్ల అనుభవం.
- జూనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సెఫ్టీ స్పెషలిస్టు- బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ ఆక్యుపేషనల్ హెల్త్ హెల్త్ అండ్ సేఫ్టీ, ఇన్విరాన్‌మెంట్ హెల్త్, ఇండస్ట్రీయల్ సేఫ్టీ, ఐదేళ్ల అనుభవం.
వయో పరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 25 ఏళ్ల నుండి గరిష్టంగా 45 ఏళ్ల ఉన్నవారు అర్హులు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు. అందువల్ల ఎటువంటి వయస్సు సడలింపు ఉండదు.
నెలవారీ వేతనం
- రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్- రూ.75,000
- ప్లానింగ్ అసిస్టెంట్ - రూ.50,000
- సీనియర్ లైవ్లీ హడ్ స్పెషలిస్టు- రూ.75,000
- జూనియర్ లైవ్లీ హడ్ స్పెషలిస్టు- రూ.50,000
- జెండర్ స్పెషలిస్ట్- రూ.75,000
- సీనియర్ ఆక్యుపేషనల్ స్పెషలిస్టు- రూ.75,000
- జూనియర్ ఆక్యుపేషనల్ స్పెషలిస్టు- రూ.50,000
ఎంపిక ప్రక్రియ
ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడానికి ఎటువంటి రాత పరీక్ష లేదు. అనుభవం, విద్య అర్హతలోని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అవసరమైతే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఇలా చేయాలి
ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://crda.ap.gov.in/Careers/General ద్వారా దరఖాస్తు దాఖలు చేయొచ్చు. దరఖాస్తు దాఖలు చేయడానికి నవంబర్ 13 రాత్రి 11.45 గంటల వరకు గడువు నిర్ణయించారు. అదనపు సమాచారం కోసం ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://crda.ap.gov.in/crda_norifications/NOT10099883/01~EMP%20Notification%2008-2024.pdf ను సందర్శించొచ్చు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉత్పన్నమైతే 9493974520 ఫోన్ నెంబర్‌ను సంప్రదించొచ్చు. అలాగే రిక్రూట్‌మెంట్ సంబంధిత సమస్యలకు recruitment@apcrda.org మెయిల్‌ను సంప్రదించొచ్చు.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు