AP Heat Wave Alert : ఏపీలో రేపు, ఎల్లుండి హీట్ వెవ్ అలర్ట్-237 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
26 May 2024, 21:24 IST
- AP Heat Wave Alert : ఏపీలో రేపు, ఎల్లుండి మొత్తం 237 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 349 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఏపీలో రేపు, ఎల్లుండి హీట్ వెవ్ అలర్ట్-237 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
AP Heat Wave Alert : రాష్ట్రంలో రేపు(మే 27), ఎల్లుండి(మే 28) 237 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 349 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్డీఏంఏ) వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలు ఉండగా, రేపు (సోమవారం) 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ప్రకటించింది. ఎల్లుండి (మంగళవారం) 165 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 149 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్డీఏంఏ తెలిపింది. ఆయా జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు నమోదు అయ్యే మండలాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు, వడగాల్పులు వీచే మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది.
ఒక పక్క రెమల్ తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఏండీ) తెలిపింది. కొన్ని జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. అయితే మరోపక్క రాష్ట్రంలో తీవ్రమైన తీవ్ర వడగాల్పులు ఉంటాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
రేపు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
శ్రీకాకుళంలో 3, విజయనగరంలో 17, పార్వతీపురం మన్యంలో 10, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, అనకాపల్లిలో 2, కాకినాడలో 6, కోనసీమలో 2, తూర్పు గోదావరిలో 17, పశ్చిమ గోదావరిలో 3, ఏలూరులో 7, కృష్ణాలో 2, బాపట్లలోని కొల్లూరు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళంలో 12, విజయనగరంలో 7, పార్వతీపురం మన్యంలో 5, విశాఖపట్నం 1, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 8, అనకాపల్లిలో 14, కాకినాడలో 14, కోనసీమలో 11, తూర్పు గోదావరిలో 2, పశ్చిమ గోదావరిలో 13, ఏలూరులో 21, కృష్ణాలో 19, ఎన్టీఆర్ జిల్లా 17, గుంటూరు 17, బాపట్ల 19, పల్నాడులో 12, ప్రకాశంలో 8 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఎల్లుండి ఇన్ని మండలాల్లో తీవ్ర వడగాల్పులు ?
శ్రీకాకుళంలో 25, విజయనగరంలో 27, పార్వతీపురం మన్యంలో 15, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, విశాఖపట్నంలో 7, అనకాపల్లిలో 24, కాకినాడలో 20, కోనసీమలో 9, తూర్పు గోదావరిలో 19, పశ్చిమ గోదావరిలో 6, ఏలూరులో 7, కృష్ణాలో 2, బాపట్లలో 1 మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళంలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 8, విశాఖపట్నంలో 1, కాకినాడలో 1, కోనసీమలో 6, పశ్చిమ గోదావరిలో 11, ఏలూరులో 21, కృష్ణాలో 19, ఎన్టీఆర్ జిల్లా 17, గుంటూరు 17, బాపట్ల 18, పల్నాడు 25, ప్రకాశంలో 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు