తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Transco Posts : ఏపీ ట్రాన్స్ కోలో కార్పొరేట్ లాయర్ల పోస్టులు, నెలకు రూ.1,20,000 జీతం-దరఖాస్తు విధానం ఇలా

AP Transco Posts : ఏపీ ట్రాన్స్ కోలో కార్పొరేట్ లాయర్ల పోస్టులు, నెలకు రూ.1,20,000 జీతం-దరఖాస్తు విధానం ఇలా

24 November 2024, 16:03 IST

google News
  • AP Transco Posts : ఏపీ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ పరిధిలో 5 కార్పొరేట్ లాయర్ పోస్టుల భర్తీకి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు ఫారమ్ లను డిసెంబర్ 9వ తేదీ లోపు విజయవాడ విద్యుత్ సౌధకు పంపాలి.

ఏపీ ట్రాన్స్ కోలో కార్పొరేట్ లాయర్ల పోస్టులు, రూ.1,20,000 జీతం-దరఖాస్తు విధానం ఇలా
ఏపీ ట్రాన్స్ కోలో కార్పొరేట్ లాయర్ల పోస్టులు, రూ.1,20,000 జీతం-దరఖాస్తు విధానం ఇలా

ఏపీ ట్రాన్స్ కోలో కార్పొరేట్ లాయర్ల పోస్టులు, రూ.1,20,000 జీతం-దరఖాస్తు విధానం ఇలా

విజయవాడలోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 కార్పొరేట్ లాయర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యాంశాలు

కార్పొరేట్ లాయర్- 5 పోస్టులు(కాంట్రాక్ట్ ప్రాతిపదికన)

  • ఏపీ ట్రాన్స్ కో- 1,
  • ఏపీపీసీసీ-4

అర్హతలు

  • మూడు సంవత్సరాల LLB / LLM లేదా ఐదు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ లా కోర్సు పూర్తి చేయాలి. వయోపరిమితి లేదు. కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • ఎంపిక విధానం- విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • ప్రాథమిక షార్ట్ లిస్టింగ్ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఏడాది కాలానికి ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అనంతరం పనితీరు ఆధారంగా ప్రతిసారీ పదవీ కాలం పొడిగిస్తారు.
  • నెల వేతనం- రూ.1,20,000

బాధ్యతలు

  • ప్రతిరోజూ కార్పొరేట్ కార్యాలయంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒప్పందాల ముసాయిదాలు, చట్టపరమైన కేసుల విచారణలు, పారా వైజ్ రిమార్క్‌లను సిద్ధం చేయడం, హైకోర్టు, ఇతర న్యాయస్థానాలు ఏదైనా
  • సంబంధిత అధికారులు అప్పగించిన ఇతర పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
  • విజయవాడలోని విద్యుత్ సౌధలో పని చేసేందుకు రెడీగా ఉండాలి. అభ్యర్థి విజయవాడలో ఉండడం తప్పనిసరి.

అప్లికేషన్ సమర్పణ

i) సూచించిన ఆకృతిలో ఎన్‌క్లోజర్‌లతో పాటు దరఖాస్తులను నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజులలోపు ఈ కింది అడ్రస్ కు పంపాలి.

ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, APTRANSCO, విద్యుత్ సౌధ, గుణదల, విజయవాడ -520004.

ii) అభ్యర్థి ఎలాంటి తప్పుడు సమాచారాన్ని అందించకూడదు.

iii) ఈ పోస్టునకు ఎంపికైన అభ్యర్థి... ఇప్పటికే మరో ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నట్లయితే ముందు ఆ పోస్టు నుంచి రిలీవ్ కావాల్సి ఉంటుంది.

చెక్ లిస్ట్

i) సూచించిన ప్రొఫార్మాలో దరఖాస్తు ఫారమ్

ii) వయస్సు, కులం, అర్హతలను ధృవీకరించే పత్రాలు,

iii) రెజ్యూమ్, పని అనుభవం సంబంధిత పత్రాలు

iv) ఎంపికైన అభ్యర్థి అంగీకార పత్రం సమర్పించాలి.

v) ప్రస్తుతం వేరే సర్వీసులో ఉంటే వారి నుంచి నిరభ్యంతర పత్రం సమర్పించాలి.

ఎడ్‌సిల్‌ లో కౌన్సిలర్ల పోస్టులు

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే నవరత్న కంపెనీలలో ఒకటైన ఎడ్‌సిల్‌(EdCIL)లిమిటెడ్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన కౌన్సిలర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎడ్‌ సిల్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో కెరీర్‌ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. 26 జిల్లాల్లో మొత్తం 255 మంది కౌన్సిలర్లను నియమిస్తారు. దీంతో పాటు పిఎంయు సభ్యులు, కో ఆర్డినేటర్లుగా ఇద్దరిని నియమిస్తారు. భారత పౌరులై తెలుగులో మాట్లాడటం, రాయడంతో పాటు భాషపై పట్టున్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కెరీర్ అండ్ మెంటల్ హెల్త్‌ కౌన్సిలర్లు

ఈ నోటిపికేషన్‌ ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 255 మంది మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను నియమిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ఎమ్మెస్సీ సైకాలజీ, ఎంఏ సైకాలజీ, బ్యాచిలర్ డిగ్రీలో సైకాలజీ పూర్తి చేసి ఉండాలి.దీంతో పాటు కెరీర్ గైడెన్స్‌ అండ్ కౌన్సిలింగ్‌లో డిప్లొమా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. కౌన్సిలింగ్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. గరిష్టంగా 35ఏళ్ల లోపు వయసు ఉండాలి.

దరఖాస్తు చేసే అభ్యర్థులు విద్యార్థులకు ముఖాముఖి కౌన్సిలింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. కెరీర్ గైడెన్స్‌‌తో పాటు విద్యార్ధుల ఆసక్తికి అనుగుణంగా కోర్సులను వివరించడం, వారిలో మానసిక స్థ్యైర్యాన్ని పెంపొందించే నైపుణ్యం కలిగి ఉండాలి. పేరెంట్స్‌, టీచర్స్‌తో కలిసి కెరీర్ కౌన్సిలింగ్ నిర్వహించాలి. విద్యార్థులు, విద్యా సంస్థలు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్‌తో కలిసి విద్యార్థుల కెరీర్‌ డెవలప్‌మెంట్‌ కోసం పనిచేయాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం