Vijayawada Trains : ప్రయాణికులకు అలర్ట్.. ఈనెల 25న విజయవాడ డివిజన్‌లో ఈ రైళ్లు రద్దు
Vijayawada Trains : ఈనెల 25న విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. అటు వాల్తేరు డివిజన్ నుంచి కొల్లాంకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ డివిజన్‌లోని తాడి, దువ్వాడ సెక్షన్లలో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఈనెల 25న పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు విజయవాడ రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం- విజయవాడ మధ్య నడిచే 12717, 12718 రైళ్లు రద్దు అయ్యాయి. కాకినాడ పోర్ట్- విశాఖపట్నం మధ్య నడిచే 17267, 17268 రైళ్లను అధికారులు రద్దు చేశారు. గుంటూరు- విశాఖపట్నం మధ్య నడిచే 17239, 17240 నంబర్ రైళ్లను రద్దు చేశారు. రాజమండ్రి- విశాఖపట్నం మధ్య నడిచే 07466, 07467 రైళ్లను కూడా రద్దు చేశారు. ప్రయాణికులు గమనించి, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
అయ్యప్ప భక్తుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రీకాకుళం- కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. విశాఖపట్నం-కొల్లాం స్పెషల్ సర్వీసులను పొడిగించాలని నిర్ణయించింది.
శ్రీకాకుళం రోడ్ -కొల్లాం స్పెషల్..
1. శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరే శ్రీకాకుళం రోడ్- కొల్లాం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08553) రైలు 2024 డిసెంబర్ 1 నుండి 2025 జనవరి 26 వరకు అందుబాటులోకి రానుంది. రైలు ఆదివారాల్లో ఉదయం 6.00 గంటలకు శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
2. కొల్లాంలో బయలుదేరే కొల్లాం- శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08554) రైలు 2024 డిసెంబర్ 2 నుండి 2025 జనవరి 27 వరకు అందుబాటులో రానుంది. ఈ రైలు సోమవారాల్లో సాయంత్రం 4.30 గంటలకు కొల్లాం నుండి బయలుదేరుతుంది. బుధవారం అర్థరాత్రి 2.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది.
హాల్టింగ్..
ఈ రెండు ప్రత్యేక రైళ్లు శ్రీకాకుళం- కొల్లాం మధ్య పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, ఈరోడ్, జోలార్‌పేట, పోదనూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, ఎట్టుమనూర్, కొట్టాయం, చెంగనస్సేరి, తిరువాల, చెంగన్నూర్, మావేలికర, కాయంకులం రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి.
విశాఖపట్నం-కొల్లాం స్పెషల్..
1. విశాఖపట్నంలో బయలుదేరే విశాఖపట్నం- కొల్లాం వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08539) రైలును 2024 డిసెంబర్ 4 నుండి 2025 ఫిబ్రవరి 26 వరకు పొడిగించారు. ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. ఈ రైలు గురువారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
2. కొల్లాం- విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08540) రైలు 2024 డిసెంబర్ 5 నుండి 2025 ఫిబ్రవరి 27 వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి గురువారం కొల్లాం నుండి రాత్రి 7.35 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు శుక్రవారం నాడు రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
హాల్టింగ్..
ఈ ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం- కొల్లాం మధ్య దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదునూరు, పాలక్కాడ్, త్రిచూర్, అలువూరు, త్రిచూర్‌లలో స్టాప్‌లు ఉంటాయి.