తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Polycet : ఏపీ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్య తేదీలివే

AP POLYCET : ఏపీ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్య తేదీలివే

24 May 2023, 11:36 IST

google News
    • ap polycet updates: ఏపీ పాలిసెట్ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మే 25 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి ప్రకటన విడుదల చేశారు.
పాలిసెట్‌-2023 కౌన్సెలింగ్‌
పాలిసెట్‌-2023 కౌన్సెలింగ్‌

పాలిసెట్‌-2023 కౌన్సెలింగ్‌

AP POLYCET 2023 Counselling Dates: పాలిసెట్ విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ సాంకేతిక విద్యాశాఖ. ఇప్పటికే ఫలితాలు ప్రకటించగా... తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. మే 25 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు మే25 నుంచి జూన్‌ 1 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన మే 29 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహించనున్నారు. జూన్‌ ఒకటి నుంచి 6వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. జూన్‌ 7న ఆప్షన్స్ మార్పును అవకాశం ఉంటుంది. జూన్‌ 9న సీట్ల కేటాయింపు చేస్తారు. అడ్మిషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత జూన్ 15 నుంచి అన్ని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.

కౌన్సెలింగ్ కు కావాల్సినవి:

-ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డు

-హాల్ టికెట్

-మార్కుల మోమోలు

-బోనఫైడ్ సర్టిఫికెట్లు

-ఆధార్ కార్డు

-కుల ధ్రువీకరణపత్రం

-ఫొటో మరియు సంతకం

ఇక ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 63,201 మంది దరఖాస్తు దారుల్లో 55,562 ఉన్నారు. 87.91 శాతం మంది బాలికలు ప్రవేశపరీక్షకు మాజరయ్యారు. 97,128 మంది బాలురకు గాను 88,030మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 90.63 శాతం మంది పరీక్షలు రాశారు.ఈసారి ఎంట్రెన్స్ పరీక్షలో మొత్తం 1,24,021 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనముగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా- బేతంచెర్ల, కడప జిల్లా-మైదుకూరు, అనంతపురం జిల్లా - గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61 పట్టణాలలోని 410 పరీక్ష కేంద్రాల్లో పాలీసెట్ 2023 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు..

అభ్యర్థులు మొదటగా https://polycetap.nic.in సైట్ లోకి వెళ్లాలి.

పాలిసెట్ ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బట్ నొక్కిన తర్వాత మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంక కీలకం.

వెబ్ కౌన్సింగ్ లో ర్యాంక్ కార్డు తప్పనిసరి.

తదుపరి వ్యాసం