తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Polycet Results 2023: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

AP POLYCET Results 2023: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

20 May 2023, 10:52 IST

    • AP POLYCET Results Updates: ఏపీ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయ్. రిజల్ట్స్ ను polycetap.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

AP POLYCET 2023 Updates:ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం 10.45 నిమిషాలకు విజయవాడలో విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించారు. https://polycetap.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈసారి ఎంట్రెన్స్ పరీక్షలో మొత్తం 1,24,021 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 63,201 మంది దరఖాస్తు దారుల్లో 55,562 ఉన్నారు. 87.91 శాతం మంది బాలికలు ప్రవేశపరీక్షకు మాజరయ్యారు. 97,128 మంది బాలురకు గాను 88,030మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 90.63 శాతం మంది పరీక్షలు రాశారు.

ఇలా చెక్ చేసుకోవచ్చు..

అభ్యర్థులు మొదటగా https://polycetap.nic.in సైట్ లోకి వెళ్లాలి.

పాలిసెట్ ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బట్ నొక్కిన తర్వాత మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంక కీలకం.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనముగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా- బేతంచెర్ల, కడప జిల్లా-మైదుకూరు, అనంతపురం జిల్లా - గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61 పట్టణాలలోని 410 పరీక్ష కేంద్రములలో పాలీసెట్ 2023 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

NOTE: మనబడి వెబ్ సైట్ http://www.manabadi.co.in/sourceview/POLYCET/Results/results-list లింక్ పై క్లిక్ చేసి మీ ర్యాంక్ తెలుసుకోవచ్చు.

TS POLYCET Results 2023: రాష్ట్రవ్యాప్తంగా మే 17వ తేదీన తెలంగాణ పాలిసెట్ 2023 ప్రవేశ పరీక్ష ముగిసింది. అయితే ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది సాంకేతిక విద్యా మండలి. ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలను ఇస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 296 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 92.94శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొంది.పాలిసెట్ ఫలితాల్లో అర్హత సాధించి వారు రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు. ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు. పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్‌ చేస్తారు.

ప్రాసెస్ ఇదే…..

విద్యార్థులు మొదటగా https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంక్ కార్డు అవసరం.

తదుపరి వ్యాసం