తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Polycet : పాలిసెట్‌ సీట్ల కేటాయింపు - ఆగస్టు 23 వరకు రిపోర్టింగ్‌

AP POLYCET : పాలిసెట్‌ సీట్ల కేటాయింపు - ఆగస్టు 23 వరకు రిపోర్టింగ్‌

19 August 2023, 8:26 IST

google News
    • AP Polycet Updates: ఏపీ పాలిసెట్ - 2023 తొలి విడత సీట్లను కేటాయించారు. మొత్తం 34,122 మంది విద్యార్థులకు  సీట్ల కేటాయించినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
పాలిసెట్ సీట్ల కేటాయింపు
పాలిసెట్ సీట్ల కేటాయింపు

పాలిసెట్ సీట్ల కేటాయింపు

AP POLYCET 2023 Seat Allotment: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2023 ప్రవేశాలకు సంబంధించి శుక్రవారం విద్యార్ధులకు సీట్లు కేటాయించినట్లు సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, పాలిసెట్ కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మొత్తం 34,624 మంది విద్యార్దులు ఆప్షన్లను ఎంపిక చేసుకోగా, 34,122 మందికి సీట్లు కేటాయించినట్లు వివరించారు. 88 ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో 10,456 సీట్లు, 181 ప్రవేటు పాలిటెక్నిక్ లలో 23,666 సీట్లు భర్తీ చేసామన్నారు. వీరంతా ఈ నెల 23 వ తేదీ లోపు అయా కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయవలసి ఉంటుందని కన్వీనర్ స్పష్టం చేశారు.

మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాలిటెక్నిక్ లలో 82729 సీట్లు ఉండగా, తొలి విడతలో మిగిలిన సీట్లను తుది విడత కౌన్సిలింగ్ లో భర్తీ చేస్తామని వివరించారు. సీట్లు పొందిన విద్యార్ధులకు 23వ తేదీ నుండే క్లాసులు ప్రారంభం అవుతాయని నాగరాణి పేర్కొన్నారు.అధికారిక వెబ్‌సైట్‌ https://polycetap.nic.in లో కాలేజీ, బ్రాంచీ వారీగా ఎంపికైన విద్యార్థుల జాబితాను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు లాగిన్ వివరాలు నమోదుచేసి సీటు కేటాయింపు నిర్దారించుకోవచ్చు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 63,201 మంది దరఖాస్తు దారుల్లో 55,562 ఉన్నారు. 87.91 శాతం మంది బాలికలు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. 97,128 మంది బాలురకు గాను 88,030మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 90.63 శాతం మంది పరీక్షలు రాశారు.ఈసారి ఎంట్రెన్స్ పరీక్షలో మొత్తం 1,24,021 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనముగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా- బేతంచెర్ల, కడప జిల్లా-మైదుకూరు, అనంతపురం జిల్లా - గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61 పట్టణాలలోని 410 పరీక్ష కేంద్రాల్లో పాలీసెట్ 2023 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

తదుపరి వ్యాసం