తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc| గౌతమ్ సవాంగ్‌కు కీలక బాధ్యతలు.. ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ

APPSC| గౌతమ్ సవాంగ్‌కు కీలక బాధ్యతలు.. ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ

HT Telugu Desk HT Telugu

17 February 2022, 11:32 IST

google News
  • మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పజెప్పింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఆయనను నియమించింది. 

ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ (File Photo)

ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్

మొన్నటివరకు ఏపీ డీజీపీగా సేవలందించిన గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు కీలక పదవిని అప్పజెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC) ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తున్నట్లు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. రెండురోజుల క్రితం వరకు ఆయనను బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన ప్రభుత్వం తాజాగా ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా నియమించింది.

1986 బ్యాచ్‌కు చెందిన గౌతమ్ సవాంగ్ మే 30, 2019న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర డీజీపీగా ఉన్న ఆయనను ఇటీవలే ఆ బదిలీ చేసింది. ఆయన స్థానంలో 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. జూలై 31, 2023 వరకు గౌతమ్ సవాంగ్ కు సర్వీసు ఉండగా.. తాజాగా ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవీని అప్పజెప్పింది.

తదుపరి వ్యాసం