తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eapcet Counselling 2024 : ఏపీ ఎంసెట్ ప్రవేశాలు - ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు , అలాట్ మెంట్ లింక్ ఇదే

AP EAPCET Counselling 2024 : ఏపీ ఎంసెట్ ప్రవేశాలు - ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు , అలాట్ మెంట్ లింక్ ఇదే

Updated Jul 17, 2024 12:46 PM IST

google News
  • AP EAMCET Counselling 2024: ఏపీలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్లు పూర్తి చేసిన వారికి ఇవాళ సీట్లను కేటాయించారు.

ఏపీ ఎంసెట్ సీట్ల కేటాయింపు

ఏపీ ఎంసెట్ సీట్ల కేటాయింపు

AP EAMCET Counselling 2024: ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలనతో పాటు వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి బుధవారం(ఇవాళ) సీట్లను కేటాయించారు. విద్యార్థులు పొందే కాలేజీ సీట్ల వివరాలను https://eapcet-sche.aptonline.in/EAPCET/ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఎంట్రీ చేస్తే మీ అలాట్ మెంట్ అర్డర్ డిస్ ప్లే అవుతుంది.

AP EAMCET Seat Allotment : ఇలా చెక్ చేసుకోండి

  • ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు https://eapcet-sche.aptonline.in/EAPCET/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Download of Allotment Order అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అలాట్ మెంట్ అర్డర్ కాపీ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.

జులై 19 నుంచి తరగతులు….

సీట్ల పొందిన విద్యార్థులు జులై 17 నుంచి జులై 22 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 19వ తేదీ నుండే తరగతులు ప్రారంభం అవుతాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. బీ - ఫార్మసీ అడ్మిషన్ల కు సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలను కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 ప‌రీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వ‌ర‌కు ప‌రీక్షలు జ‌రిగాయి.

ఈ ప‌రీక్షల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది ద‌రఖాస్తు చేసుకోగా, అందులో 3,39,139 మంది ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యారు. అంటే 93.47 శాతం మంది ప‌రీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.

ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,374 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,95092 మంది ఉత్తీరణ సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకోగా 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 70,352 మంది ఉత్తీర్ణత సాధించారు.

AP EAMCET Rank 2024: మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి?

Step 1 : అభ్యర్థులు ముందుగా ఈ వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 : అనంతరం హోంపేజీలో ఏపీ ఈఏపీసెట్ 2024 పై క్లిక్ చేయండి.

Step 3 : హోంపేజీలో రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 4 : విద్యార్థి రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.

తదుపరి వ్యాసం