AP EAPCET Results 2024 : ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వచ్చేశాయ్, ఇలా చెక్ చేసుకోండి-amaravati ap eapcet 2024 results released check apsche website for score card ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eapcet Results 2024 : ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వచ్చేశాయ్, ఇలా చెక్ చేసుకోండి

AP EAPCET Results 2024 : ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వచ్చేశాయ్, ఇలా చెక్ చేసుకోండి

Bandaru Satyaprasad HT Telugu
Jun 11, 2024 04:52 PM IST

AP EAPCET Results 2024 : ఏపీ ఈఏపీసెట్-2024 ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు ఫలితాలను ఈఏపీసెట్ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వచ్చేశాయ్
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వచ్చేశాయ్

AP EAPCET Results 2024 : ఏపీ ఈఏపీసెట్-2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌(AP EAPCET) పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాలు ఉన్నత విద్యామండలి మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఫలితాలు, స్కోర్ కార్డును విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ఇంజినీరింగ్ విభాగంలో

ఫస్ట్ ర్యాంక్- మాకినేని జిష్ణు సాయి(గుంటూరు), సెకండ్ ర్యాంకు - సాయి హశ్వంత్ రెడ్డి(కర్నూలు), థర్డ్ ర్యాంకు-భోగళ్లపల్లి సందేష్(ఆదోని)

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో

ఫస్ట్ ర్యాంక్ - శ్రీశాంత్ రెడ్డి(హైదరాబాద్), సెకండ్ ర్యాంక్- పూల దివ్య తేజ(సత్యసాయి జిల్లా), థర్డ్ ర్యాంక్- వడ్లపూడి ముఖేష్ చౌదరి(తిరుపతి)

ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలను కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 ప‌రీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వ‌ర‌కు ప‌రీక్షలు జ‌రిగాయి. ఈ ప‌రీక్షల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది ద‌రఖాస్తు చేసుకోగా, అందులో 3,39,139 మంది ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యారు. అంటే 93.47 శాతం మంది ప‌రీక్షలు రాశారు. ఇప్పటికే ఈఏపీసెట్ ప్రవేశపరీక్ష ప్రాథమిక కీని ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. వీటిపై మే 26 వరకు అభ్యంతరాలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి?

  • Step 1 : అభ్యర్థులు ముందుగా ఈ వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ లింక్ పై క్లిక్ చేయండి.
  • Step 2 : అనంతరం హోంపేజీలో ఏపీ ఈఏపీసెట్ 2024 పై క్లిక్ చేయండి.
  • Step 3 : హోంపేజీలో రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Step 4 : విద్యార్థి రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.

ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,374 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,95092 మంది ఉత్తీరణ సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకోగా 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 70,352 మంది ఉత్తీర్ణత సాధించారు.

ఏపీ ఈఏపీసెట్ ద్వారా ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) కోర్సుల్లో ,బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా-డి, బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం