Anantapur Lecturer Murder : అనంతపురంలో లెక్చరర్ దారుణ హత్య, మనస్తాపంతో భార్య మృతి!
11 March 2024, 15:45 IST
- Anantapur Lecturer Murder : అనంతపురం ఎస్కేయూ లెక్చరర్ మూర్తిరావు గోఖలే దారుణ హత్య గురయ్యారు. భర్త హత్యను చూసిన భార్య గుండెపోటుతో మృతి చెందింది.
అనంతపురంలో లెక్చరర్ దారుణ హత్య
Anantapur Lecturer Murder : అనంతపురం జేఎన్టీయూ సమీపంలో లెక్చరర్ దారుణ హత్యకు(Anantapur Lecturer Murder) గురైయ్యారు. భర్త మరణాన్ని తట్టుకోలేక మనస్తాపతంతో భార్య గుండెపోటుతో(Heart Attack) మరణించారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో(SKU) లెక్చరర్ గా పనిచేస్తున్నారు మూర్తి రావు గోఖలే(59). ఆయన భార్య శోభ(56)తో కలిసి నగరంలో నివసిస్తున్నారు. గతంలో మూర్తి రావు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేశారు. ఆయన జేఎన్‌టీయూ (JNTU)ఎంట్రన్స్ కు ఎదురుగా ఉన్న కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం గోఖలే మేనల్లుడు ఆయనపై దాడి చేశాడు. బ్లేడుతో గొంతు కోసి హత్య చేశాడు. మూర్తిరావు తన మేనల్లుడు ఆదిత్యకు ఉద్యోగం ఇప్పిస్తానని గతంలో అతని దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఈ విషయంలో ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఆదిత్య మూర్తిరావు గొంతు కోసి హత్య చేశాడు. కళ్ల ముందే భర్త మృతి చెందడంతో మనస్తాపంతో మూర్తిరావు భార్య శోభ గుండెపోటుతో మృతి చెందారు. ఒకేసారి దంపతులిద్దరూ మృతి చెందడంతో బంధువుల కన్నీరు మున్నీరవుతున్నారు.
భర్య హత్యకు గురైన 24 గంటల్లో భార్య మృతి
మూర్తిరావు హత్య జరిగిన 24 గంటల్లోనే భార్య శోభ మృతి చెందారు. మూర్తిరావు భార్య శోభకు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో(Heart Attack) మరణించారు. భర్త హత్యకు గురైన 24 గంటల్లోనే భార్య గుండెపోటుతో మృతి చెందడంతో... కుటుంబ సభ్యులు తీవ్ర విషాదం నెలకొంది. మూర్తి రావును హత్య చేసిన మేనల్లుడు ఆదిత్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యాచకురాలి దారుణ హత్య
హైదరాబాద్ లో(Hyderabad Crime) దారుణం జరిగింది. ఎల్బీనగర్ పరిధిలో ఓ యాచకురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ సమీపంలో యాచకురాలను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. దుండుగులు యాచకురాలి గొంతు కోసి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.