తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Employees : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఆ ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ ప్రకటన

AP Govt Employees : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఆ ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ ప్రకటన

20 March 2024, 15:30 IST

google News
    • AP Govt Employees : ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఈవో-II లకు నెలకు రూ.1000 రవాణా భత్యం ఇవ్వాలని నిర్ణయించింది.
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP Govt Employees : ఎన్నికల వేల ఉద్యోగులను(Govt Employees) ఆకర్షించేందుకు ప్రభుత్వాలు వివిధ మార్గాలను అనుసరిస్తాయి. మార్చి 16న ఎన్నికల కోడ్ (Election Code)అమల్లోకి రాక ముందే రాష్ట్ర ప్రభుత్వం డీఏ ప్రకటన చేసిన విషయం తెలిసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఈవో-II లకు నెలకు రూ. వెయ్యి చొప్పున ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్(Fixed Transport Allowance) ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఎంఈవో-1కు (MEO-II)ఈ భత్యం అందిస్తున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎంఈవో-II లను నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమించింది. వీరిని మండల విద్యాధికారులు, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల బదిలీల ద్వారా నియమించారు. ఎంఈవో-II ఉపాధ్యాయుల టీచింగ్, విద్యార్థుల అభ్యాసనకు వీలుగా స్కూళ్లను(Govt Schools) తీర్చిదిద్దడం వంటి చర్యలు తీసుకుంటారు. బడి బయట పిల్లలను గుర్తించి, వారిని స్కూళ్లలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటారు. వృత్తి విద్యలో విద్యార్థుల ఆసక్తిని గమనిస్తుంటారు. దీంతో పాటు విద్యార్థులను సైన్స్ ఫెయిర్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వైపు ప్రోత్సహిస్తుంటారు. అయితే ఈ కార్యక్రమాలు అధికారులు మండలంలోని వివిధ పాఠశాలలు వెళ్లాల్సి ఉంటుంది. పాఠశాలల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు వీలుగా ప్రభుత్వం (AP Govt)తాజాగా ఫిక్సిడ్ ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ ప్రకటించింది. నెలకు రూ.1000 చొప్పున రవాణా భత్యం ఇవ్వనున్నారు.

రెండు డీఏలు విడుదల

ఎన్నికల వేల ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు(AP Govt Employees) శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు రెండు డీఏలను(DA) విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ఉత్తర్వులను విడుదల చేసింది. ఏప్రిల్‌ జీతంతో కలిపి ఒక డీఏ, జులై నెల జీతంతో మరొక డీఏ అందజేయనున్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కోడ్(Election Code 2024)కు ముందే డీఏపై ప్రకటన చేసింది. కోడ్ కు ముందే ప్రభుత్వం డీఏల విడుదలకు ఆమోదముద్ర వేయటంతో పాటు ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ రద్దు (CPS)డిమాండ్ల ఉద్యోగులు గత ఏదేళ్లుగా సమ్మెలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ముందే ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు, అంగన్ వాడీలు ప్రత్యక్షంగా నిరసలకు దిగిన సంగతి తెలిసిందే.

కేసుల ఉపసంహరణ

మరోవైపు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులపై(Municipal Workers) నమోదైన పోలీసు కేసులను ఉపసంహరిస్తూ హోంశాఖ ఉత్తర్వులను జారీచేసింది. 2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 11 తేదీ వరకూ నిర్వహించిన సమ్మె కాలంలో మున్సిపల్ అధికారుల ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు తెలిపింది. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఇటీవల డీజీపీకి లేఖ రాశారు. ఏలూరు, విశాఖ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలలో నమోదైన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ ప్రకటన చేసింది. ఎన్నికల సమయం, చర్చల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం