Festival Special Trains : భువనేశ్వర్-యశ్వంతపూర్ మధ్య ఏసీ ప్రత్యేక రైళ్లు - ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే
27 September 2024, 17:41 IST
- పండగల సీజన్ సమీపించిన వేళ రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లపై దృష్టిపెట్టింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భువనేశ్వర్-యశ్వంతపూర్-భువనేశ్వర్ మధ్య ఏసీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ వివరాలను వాల్తేరు రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
ఏసీ ప్రత్యేక రైళ్లు
దీపావళి, పూజ పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ వివరాలను తెలిపారు.
భువనేశ్వర్ నుండి బయలుదేరే భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ వీక్లీ ఏసీ స్పెషల్ (02811) రైలు 2024 అక్టోబర్ 5 నుండి 2024 నవంబర్ 30 వరకు ప్రతి శనివారాల్లోరాత్రి 7:15 గంటలకు బయలుదేరుతుంది. ఇది శ్రీకాకుళం రోడ్‌కి రాత్రి 11:28 గంటలకు చేరుకుని అక్కడ నుంచి రాత్రి 11:30 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం అర్థరాత్రి 12:30 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి అర్థరాత్రి 12:40 గంటలకు బయలుదేరుతుంది.
కొత్తవలసకు అర్థరాత్రి 1:05 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి అర్థరాత్రి 1:07 గంటలకు బయలుదేరుతుంది. దువ్వాడకు అర్థరాత్రి 1:53 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి అర్థరాత్రి 1:55 గంటలకు బయలుదేరి సోమవారాల్లో అర్థరాత్రి 12:15 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. మొత్తం తొమ్మిది ట్రిప్పులు ఈ రైలు తిరుగుతుంది.
యశ్వంత్‌పూర్ నుండి బయలుదేరే యశ్వంత్‌పూర్-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ (02812) రైలు 2024 అక్టోబర్ 7 నుండి 2024 డిసెంబర్ 2 వరకు సోమవారాల్లో ఉదయం 4.30 గంటలకు బయలుదేరుతుంది. అది మరుసటి రోజు తెల్లవారుజామున 4:30 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడ నుంచి తెల్లవారుజామున 4:32 గంటలకు బయలుదేరుతుంది. కొత్తవలస ఉదయం 5:20 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 5:22 గంటలకు బయలుదేరుతుంది.
విజయనగరం ఉదయం 6:00 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 6:10 గంటలకు బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్డుకు ఉదయం 7:03 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 7:05 గంటలకు బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12.15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.మొత్తం తొమ్మిది ట్రిప్పులు ఈ రైలు తిరుగుతుంది.
ఈ రెండు రైళ్లు భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ మధ్య ఖుర్దా రోడ్, బ్రహ్మాపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, ధోనే, ధరంవరం, యస్త్యసాయి ప్రశాంతి నిలయం, భువంత్‌పూర్ స్టేషన్‌లో ఆగుతాయి. ఈ రైళ్లలో థర్డ్ ఏసీ-16, జనరేటర్ మోటార్ కార్-02 ఉన్నాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ కోరారు.
రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.