తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Free Gas Cylinder : ఉచిత సిలిండర్‌ పథకం.. రాయితీ ఎలా, ఎప్పుడు ఇస్తారు.. 8 ముఖ్యమైన అంశాలు

AP Free Gas Cylinder : ఉచిత సిలిండర్‌ పథకం.. రాయితీ ఎలా, ఎప్పుడు ఇస్తారు.. 8 ముఖ్యమైన అంశాలు

27 October 2024, 10:39 IST

google News
    • AP Free Gas Cylinder : ఏపీ ప్రభుత్వం దీపం పథకం కింద మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అక్టోబర్ 31న ప్రారంభించనున్నారు. అయితే.. దీనికి సంబంధించి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. రాయితీ ఎలా, ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులు చర్చించుకుంటున్నారు.
ఉచిత సిలిండర్‌ పథకం.. 8 ముఖ్యమైన అంశాలు
ఉచిత సిలిండర్‌ పథకం.. 8 ముఖ్యమైన అంశాలు

ఉచిత సిలిండర్‌ పథకం.. 8 ముఖ్యమైన అంశాలు

ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలు రూపొందించారు. అయితే.. రాయితీపై లబ్ధిదారులకు అనుమానాలున్నాయి. సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు.. ఎలా ఇస్తారు.. ఎలా పొందాలి అనే సందేహాలున్నాయి. వాటికి సంబంధించి 8 ముఖ్యమైన అంశాలు ఇవీ.

1.ఉచిత సిలిండర్‌ పథకానికి అమల్లో ఉన్న గ్యాస్‌ కనెక్షన్‌, రేషన్, ఆధార్‌ కార్డును అధికారులు ప్రాతిపదికగా నిర్ణయించింది.

2. ఇప్పుడు వినియోగదారులు మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్‌ బుక్‌ చేసుకుంటే.. ఆ తర్వాత ఇంధన సంస్థలు వంటగ్యాస్‌ రాయితీగా ఒక్కో సిలిండర్‌పై రూ.14 నుంచి 25 వరకు జమ చేస్తున్నాయి.

3.ఇప్పుడు మాత్రం ఫ్రీ సిలిండర్‌కు రాయితీ మొత్తాన్ని సిలిండర్‌ అందించిన తర్వాత 2 రోజుల్లో లబ్ధిదారుడి ఖాతాల్లో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

4.ఈనెల 31 నుంచి వచ్చే ఏడాది మార్చి ఆఖరు వరకు మొదటి సిలిండర్‌ రాయితీ పంపిణీ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన సంస్థల వద్ద సబ్సిడీ మొత్తాన్ని రూ.894.92 కోట్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

5. రూ.894.92 కోట్లను సీఎం చంద్రబాబు చెక్కు రూపంలో విడుదల చేయనున్నారు. సిలిండర్ రాయితీకి కేంద్ర ప్రభుత్వం, ఉచిత గ్యాస్‌ పథకం కింద అయిదు రాష్ట్రాలు పాటిస్తున్న విధానాల తీరునే ఏపీలోనూ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

6.ఏడాదికి మూడు సిలిండర్లకు కలిపి మొత్తం రూ.2,684.75 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.

7.డిసెంబరు నుంచి మార్చి వరకు ఒక సిలిండర్‌, ఏప్రిల్‌ నుంచి జులై వరకు రెండో సిలిండర్, ఆగస్టు నుంచి నవంబరులోగా మూడో సిలిండర్‌ పంపిణీ చేయనున్నారు.

8.ఈ పథకం ప్రారంభం సందర్భంగా ఈ అక్టోబరు 31 నుంచి 2025 మార్చి ఆఖరు వరకు మొదటి సిలిండర్‌కు రాయితీ వర్తింపజేయనున్నారు.

దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు పొందేందుకు అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి. బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారై ఉండాలి. తెల్లరేషన్ కార్డులు కలిగి ఉండాలి. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి. వీరికి మాత్రమే రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం అందజేయనుంది.

తదుపరి వ్యాసం