YS Sharmila: కాళేశ్వరం అవినీతిపై ఈటల, బండి మౌనమేల?: షర్మిల-ys sharmila demands bandi sanjay eetala rajender to talk over corruption in kaleswaram project ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila: కాళేశ్వరం అవినీతిపై ఈటల, బండి మౌనమేల?: షర్మిల

YS Sharmila: కాళేశ్వరం అవినీతిపై ఈటల, బండి మౌనమేల?: షర్మిల

HT Telugu Desk HT Telugu
Nov 18, 2022 07:00 PM IST

YS Sharmila: కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై ఈటల రాజేందర్, బండి సంజయ్ మౌనంగా ఎందుకున్నారని వైఎస్సార్‌టీపీ అధినేత వై.ఎస్.షర్మిల ప్రశ్నించారు.

వై.ఎస్.షర్మిల ప్రజాప్రస్తాన యాత్రలో బహిరంగ సభ (ఫైల్ ఫోటో)
వై.ఎస్.షర్మిల ప్రజాప్రస్తాన యాత్రలో బహిరంగ సభ (ఫైల్ ఫోటో) (Mohammed Aleemuddin)

ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా హుజూరాబాద్ టౌన్‌లో వైఎస్సార్‌టీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభ సభలో వై.ఎస్.షర్మిల స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై నిప్పులు చెరిగారు. ‘స్థానిక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌పై కేసీఆర్ అవినీతి ఆరోపణలు చేసి అవమానించి పార్టీ నుంచి వెళ్లగొట్టారు. అయినా హుజురాబాద్ ప్రజలు ఈటలను అక్కున చేర్చుకున్నారు. బీజేపీ‌లో చేరకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా.. గెలిపించే వారు కదా. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి బీజేపీలో ఎందుకు చేరినట్లు..? సిద్ధాంతాలను అన్నింటినీ ఎందుకు పక్కన పెట్టారు? మిమ్మల్ని మీరు కాపడుకొక పోతే... మీరు ఏ అవినీతి చేయక పోతే ఎందుకు బీజేపీలో చేరారు? అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి బీజేపీలో చేరారు..’ అని దుయ్యబట్టారు.

yearly horoscope entry point

‘ఇదే ఈటల రాజేందర్ 7 ఏళ్లు కేసీఆర్‌తోనే నడిచారు. ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా కేసీఅర్ అవినీతి మీకు తెలియాలి కదా..? కేసీఅర్ అవినీతి పై ఈటల ఎందుకు మాట్లాడటం లేదు..? మిమ్మల్ని అవినీతి పరుడు అని ముద్ర వేశాడు కదా..? పార్టీలో నుంచి వెళ్లగొట్టాడు కదా? కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడితే మీ అవినీతి కూడా బయట పడుతుంది అని భయమా..? కేసీఆర్ అవినీతిలో మీకు వాటాలు ఉన్నాయని భయమా..? ఎందుకు మీరు నోరు విప్పడం లేదు..? కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్ అవినీతి డొంక కదిలిస్తే మీ అవినీతి కూడా బయట పడుతుందని భయమా? నిజంగా ఉద్యమ కారుడైతే నిజాయితీ ఉంటే, అవినీతి చేయక పోతే మీకు ఒక సవాల్. కేసీఆర్ అవినీతి‌పై మాట్లాడేది ఒక్క వైఎస్సార్‌టీపీ మాత్రమే. రాజకీయాలకు అతీతంగా మాతో చేతులు కలపండి. కేసీఆర్ అవినీతిపై నోరు విప్పాలి. ఈటలకు దమ్ముంటే మా సవాల్ స్వీకరించాలి..’ అని డిమాండ్ చేశారు.

బండి సంజయ్‌పై షర్మిల ఆరోపణలు

‘ఇక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. గతంలో ఆయన ఒక కార్పొరేటర్. భార్య పుస్తెలు అమ్మి ఎంపీగా గెలిచానని చెప్పారు. ఎంపీ అయ్యాక వందల కోట్లు ఆస్తులు కూడబెట్టాడట. ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని కోట్లు? మతం పేరుతో చిచ్చు పెట్టాలి.. ఆ మంటల్లో చలి కాచుకోవాలి. మసీదులు లక్ష్యంగా బండి సంజయ్ మాట్లాడుతుంటే పక్కన ఉండి ఈటల నోరు విప్పడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బండి సంజయ్‌కు ముడుపులు ముట్టాయి. ఆయన అమాయకుడు, నిర్దోషి అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై నోరు విప్పాలి..’ అని వ్యాఖ్యానించారు.

Whats_app_banner