Minor Girl Rape: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు అరెస్ట్
Minor Girl Rape: హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బోరబండా పోలీసులు 19 ఏళ్ల సింగ్ అనే యువకుడితో పాటు అతడి మైనర్ స్నేహితుడిని అరెస్టు చేశారు.
Minor Girl Rape: హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బోరబండా పోలీసులు 19 ఏళ్ల సింగ్ అనే యువకుడితో పాటు అతడి మైనర్ స్నేహితుడిని అరెస్టు చేశారు.
బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి కుటుంబం గతంలో బోరబండా లో ఓ ఇంట్లో అద్దెకు ఉండేది. అదే ప్రాంతంలో ఉండే నిందితుడు 19 ఏళ్ళ సింగ్ తో పాటు అతని స్నేహితుడు కలిసి మార్చి 2023 లో బాలిక పై మొదటి సారి అత్యాచారం చేశారు. అప్పటి నుంచి మైనర్ బాలికను ఇద్దరు యువకులు కత్తితో చంపుతాం అంటూ బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన బాలికను గమనించిన తల్లి ఏమైందని ఆరా తీయడంతో దాదాపు ఏడు నెలలుగా తాను అనుభవిస్తున్న బాధను, తనపై జరిగిన వేధింపుల విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు, వారు సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం తో పాటు ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్