TS DOST 2023: విద్యార్థులకు అలర్ట్... డిగ్రీ తొలి విడత సీట్ల కేటాయింపు
DOST 2023 Admissions: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి తొలి విడత సీట్లను కేటాయించారు అధికారులు. ఇందులో భాగంగా 73,220 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి.
TSCHE Latest News: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి తొలి విడుత సీట్ల కేటాయింపులు చేసింది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా మొత్తం 73,220 మంది సీట్లు కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు.
దోస్త్ లో వెబ్ ఆప్షన్ల ఆధారంగా... రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. దోస్త్‌లో మొత్తం 889 కళాశాలలు ఉండగా... మొత్తం సీట్లు 3,56,258 ఉన్నాయి. ఇక ఇవాళ్టి నుంచే రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జూన్ 27 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకశం ఉంది.
రెండో విడత రిజిస్ట్రేషన్లు
జూన్ 16 నుంచి జూన్ 26 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
జూన్ 16 నుంచి జూన్ 27 వరకు రెండో విడత దోస్త్ ఆప్షన్లు
జూన్ 30వ తేదీన రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
జూలై 1 నుంచి 5 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు
జూలై ఒకటి నుంచి జూలై 6 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలి.
జూలై 10వ తేదీన మూడో విడత సీట్లు కేటాయించనున్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజులు...
మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇక రెండు, మూడో విడతలో రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూలై 17 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు నిర్వహించనున్నారు.డిగ్రీ ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించాలి. ఇందులో Candidate Pre-Registrationతో రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత... Application Fee Paymentతో తగిన ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత Candidate Login ద్వారా ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
NOTE:
ఈ లింక్ పై క్లిక్ చేసి అధికారిక సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
సంబంధిత కథనం