TG Group 2 Exams: తెలంగాణ గ్రూప్‌ 2 టైమ్‌ టేబుల్ విడుదల.. డిసెంబర్‌ 9 నుంచి హాల్‌ టిక్కెట్లు, 15, 16న పరీక్షలు-telangana group 2 time table released hall tickets from december 9 exams on 15th and 16th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Group 2 Exams: తెలంగాణ గ్రూప్‌ 2 టైమ్‌ టేబుల్ విడుదల.. డిసెంబర్‌ 9 నుంచి హాల్‌ టిక్కెట్లు, 15, 16న పరీక్షలు

TG Group 2 Exams: తెలంగాణ గ్రూప్‌ 2 టైమ్‌ టేబుల్ విడుదల.. డిసెంబర్‌ 9 నుంచి హాల్‌ టిక్కెట్లు, 15, 16న పరీక్షలు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 22, 2024 08:30 AM IST

TG Group 2 Exams: తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో 783 గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. డిసెంబర్‌ 9వ తేదీ నుంచి హాల్‌ టిక్కెట్‌లో కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 15,16 తేదీల్లో పరీక్షల్ని నిర్వహిస్తారు.

తెలంగాణ గ్రూప్‌ 2 హాల్‌ టిక్కెట్‌ అలర్ట్‌
తెలంగాణ గ్రూప్‌ 2 హాల్‌ టిక్కెట్‌ అలర్ట్‌

TG Group 2 Exams: తెలంగాణ గ్రూప్-2 రాత పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. డిసెంబర్‌ 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్ టీజీపీఎస్సీ విడుదల చేసింది.

తెలంగాణలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబరు 15, 16 తేదీల్లో రాత పరీక్షలు జరుగుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ప్రకటించింది. గ్రూప్‌ 2 హాల్ టికెట్లు డిసెంబరు 9 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయనికమిషన్‌ పేర్కొంది. తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్షల టైంటేబుల్, సూచనలతో కూడిన వివరాలను వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. ప్రతి పేపరులో 150 ప్రశ్నలుంటాయి. 150 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

అరగంట ముందే ఉండాలి..

గ్రూప్‌ 2 పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అర గంట ముందు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం నిర్వహించే పరీక్షకు 9.30 గంటల లోపు మాత్రమే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 గంటల తరువాత ఎవరిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ తెలిపారు.

అభ్యర్ధులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు అందించనున్నారు. పరీక్షల్లో అందించే నమూనా ఓఎంఆర్ షీట్లు, ఇతర సూచనలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పేపర్-1 పరీక్ష రాసిన హాల్ టికె ట్తోనే మిగతా పరీక్షలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు జారీ చేసే హాల్‌టిక్కెట్‌, ప్రశ్నపత్రాలు నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రపరుచుకోవాలని, వాటిని, అడిగినప్పుడు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.

ఓఎంఆర్‌ షీట్‌ కోసం ఈ లింకును అనుసరించండి.

https://websitenew.tspsc.gov.in/preview/UFJFU1NOT1RFL0dST1VQMi1TQU1QTEUtT01SLUFOU1dFUlNIRUVULTIwMjQxMTIwMjMzNjE0LnBkZmFjY2Vzc3RpbWU9MjAyNC0xMi0xNg==r95v17a0y2d8i13v

హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సమ యంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే 040-23542185 5 040-23542187 నంబర్లను సాధారణ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయాలని సూచించారు.

'గ్రూప్-2' టైంటేబుల్..

పేపర్-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ డిసెంబరు 15, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30

పేపర్-2: హిస్టరీ, పాలిటీ, సొసైటీ

డిసెంబరు 15, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30

పేపర్-3: ఎకానమీ, డెవలప్మెంట్ పేపర్లు

డిసెంబరు 16, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30

పేపర్-4: తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు డిసెంబరు 16, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.

అభ్యర్థులకు ఎట్టిపరిస్థితుల్లో డూప్లికేట్ హాల్ టికెట్ తరువాత జారీ చేయరని కమిషన్ స్పష్టం చేసింది. ఏదైనా సాంకేతిక సమస్యల విషయంలో, అభ్యర్థి TGPSC సాంకేతిక సహాయాన్ని సంప్రదించవచ్చు

ఫోన్ నంబర్లు 040-23542185 లేదా 040-23542187లో డెస్క్

ఇమెయిల్ Helpdesk@tspsc.gov.in.

హెల్ప్ డెస్క్ కాల్ టైమింగ్స్: 10:30 A.M. నుండి 1:00 P.M. & 1:30 P.M. కు

Whats_app_banner