Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ 4 బ్రేకౌట్​ స్టాక్స్​కి టైమ్​ వచ్చింది! ట్రాక్​ చేయండి..-stocks to buy today 22nd november 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ 4 బ్రేకౌట్​ స్టాక్స్​కి టైమ్​ వచ్చింది! ట్రాక్​ చేయండి..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ 4 బ్రేకౌట్​ స్టాక్స్​కి టైమ్​ వచ్చింది! ట్రాక్​ చేయండి..

Sharath Chitturi HT Telugu
Nov 22, 2024 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 423 పాయింట్లు పడి 77,156 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 169 పాయింట్లు కోల్పోయి 23,350 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 254 పాయింట్లు నష్టపోయి 50,373 వద్దకు చేరింది.

నిఫ్టీ50కి 23350 -23400 లెవల్స్​ కీలకంగా మారాయి. అక్కడ సరైన సపోర్ట్​ లభిస్తే మంచి పుల్​బ్యాక్​ కనిపించవచ్చు. నిఫ్టీ50 23500-23550 వరకు వెళ్లొచ్చు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 5320.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4200.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

నవంబర్​ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 39,668.98 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 35,836.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.06శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.53తం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.03శాతం వృద్ధిచెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​- బై రూ. 325, స్టాప్​ లాస్​ రూ. 315, టార్గెట్​ రూ. 335

జిందాల్​ స్టీల్​ అండ్​ పవర్​- బై రూ. 871, స్టాప్​ లాస్​ రూ. 860, టార్గెట్​ రూ. 895

గెయిల్​ ఇండియా- బై రూ. 185, స్టాప్​ లాస్​ రూ. 180, టార్గెట్​ రూ. 193

దివీల్​ ల్యాబొరేటరీ- బై రూ. 5977, స్టాప్​ లాస్​ రూ. 5937, టార్గెట్​ రూ. 6077

ఆంబర్​ ఎంటర్​ప్రైజెస్​- బై రూ. 6530, స్టాప్​ లాస్​ రూ. 6450, టార్గెట్​ రూ. 6750

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

పేటీఎం: రూ.845.40 వద్ద కొనండి, టార్గెట్ రూ.905, స్టాప్ లాస్ రూ.816;

ధని సర్వీసెస్: రూ.73.55 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.79, స్టాప్ లాస్ రూ.71;

ఫోర్టిస్ హెల్త్కేర్: రూ.680.70 వద్ద కొనండి, టార్గెట్ రూ.728, స్టాప్ లాస్ రూ.657

ఏడీఎఫ్ ఫుడ్స్: రూ .302.75 వద్ద కొనండి, టార్గెట్ రూ .324, స్టాప్ లాస్ రూ .292.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం