TS CPGET 2022 Result Link : కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి-ts cpget 2022 result released check your results and download score card here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Cpget 2022 Result Link : కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

TS CPGET 2022 Result Link : కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

Anand Sai HT Telugu
Sep 20, 2022 05:28 PM IST

TS CPGET 2022 Result Released : తెలంగాణ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(CPGET) 2022 ఫలితాలు విడుదల అయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం CPGET 2022 పరీక్ష ఫలితాలు, స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్లో విడుదల చేసింది. ఎలా చూసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

సీపీగెట్ ఫలితాలు విడుదల
సీపీగెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ CPGET 2022 ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థు చెక్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది ఆగస్టు 11 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ విధానంలో సీపీగెట్‌ 2022 పరీక్ష జరిగింది. సుమారు. 57,262 మంది హాజరయ్యారు. మొత్తం 45 సబ్జెక్టుల్లో పీజీ, 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌, పీజీ డిప్లొమా కలిపి 50 కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు జరిగాయి. ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇలా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అభ్యర్థులు తమ CPGET 2022 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ నుండి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి.

TS CPGET 2022 ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

TS CPGET ఫలితాల కోసం cpget.tsche.ac.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

హోమ్‌పేజీలో ‘డౌన్‌లోడ్ స్కోర్ కార్డ్’ లింక్‌పై క్లిక్ చేయండి

మీ TS CPGET 2022 హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి

TS CPGET 2022 ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోండి.

ఒకవేళ అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడలేకపోతే కొన్ని విశ్వసనీయమైన థర్డ్ పార్టీ వెబ్ సైట్లలో కూడా చూసుకోవచ్చు. manabadi.co.inలో TS CPGET 2022 పరీక్ష ఫలితాలను చూసుకోండి. TS CPGET 2022 కౌన్సెలింగ్ తేదీలు త్వరలో ప్రకటిస్తారు.

IPL_Entry_Point